Rahul gandhi: న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్‌లు మోడీ అస్త్రాలు: రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Feb 02, 2022, 08:58 PM IST
Rahul gandhi: న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్‌లు మోడీ అస్త్రాలు:  రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

Rahul gandhi controversial statement :భారతదేశాన్ని రెండు భారతదేశాలుగా వ‌ర్ణించారు. ఒకటి ధనవంతుల భారతదేశం. మరొకటి పేదల భారతదేశం అని, ఈ రెండింటి  మ‌ధ్య వ్య‌త్యాసం పెరుగుతోందని విమ‌ర్శించారు. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  

Rahul gandhi controversial statement :లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థ నుండి ఎన్నికల సంఘం వరకు ప్రతి సంస్థపై దాడి చేశారని రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే.. వారి గొంతును అణిచివేసేందుకు న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్‌లను ప్రభుత్వ సాధనాలు మార్చుకుంద‌ని అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో స‌రైన‌ విజన్ లేదనీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో 48 శాతం మంది ప్రజల ఆదాయం కరోనా కాలంలో పడిపోయిందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఈ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని, దేశంలో పేదలను కొల్లగొట్టి ధనికులకు పంచుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు  రాహుల్ గాంధీ. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్‌ స్పైవేర్‌లను  రాష్ట్రాల‌ను స్వర నాశనం చేసే సాధనాలుగా ఉపయోగిస్తోందని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. 


మనకు రెండు భారతదేశాలు ఉన్నాయి. ఒకటి ధనవంతుల భారతదేశం. మరొకటి పేదల భారతదేశం అని, ఈ రెండింటి  మ‌ధ్య వ్య‌త్యాసం పెరుగుతోందని విమ‌ర్శించారు. వీరికి వాస్తవానికి ప్రభుత్వం నుంచి నీటి సదుపాయం, విద్యుత్ సదుపాయం, ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం లేదు. వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంటుంది. అధికారం కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి వీరికి అన్ని సదుపాయాలు అందుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వమే వారి కోసం పని చేస్తోంది. ఇంకొక భారతదేశం పూర్తిగా పేద ప్రజలది. వీరికి ప్రభుత్వం నుంచి ఆపన్న హస్తం అందాలి.  కానీ వీరి గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ఈ రెండు దేశాల మధ్య విభజన నానాటికీ పెరుగుతోంది. దేశంలోని 10 మంది ధనవంతుల వద్ద ఉన్న డబ్బు దేశంలోని 40 కోట్ల భారతీయుల ఆదాయంతో సమానం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

‘‘మేడ్ ఇన్ ఇండియా అనే మాట‌ల‌కు మాత్రమేన‌నీ, బీజేపీతో  మేడ్ ఇన్ ఇండియా ఇక సాధ్యం కాదనీ,  ‘మేడ్ ఇన్ ఇండియా’ అంటూ దేశాన్ని నాశనం చేశారని ఆగ్ర‌హంచేశారు రాహుల్ గాంధీ. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలనీ, లేకుంటే ‘మేడ్ ఇన్ ఇండియా’ సాధ్యం కాదు.. చిన్న మధ్య తరహా పరిశ్రమలు మాత్రమే ఉద్యోగాలను సృష్టించగలవు' అని రాహుల్ గాంధీ అన్నారు.

బ‌డ్జెట్ లో నిరుద్యోగం, యువత ప్రస్తావన లేదనీ,  సామాన్యుల గొంతును మోదీ ప్రభుత్వం అణిచివేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవ్యవస్థను, ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేశారు. ప్రజల గొంతును అణిచివేయ‌డానికి  న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్‌లను మోదీ ప్రభుత్వానికి అస్త్రాలు మార్చుకుంద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు.

 ఓడరేవులు, విమానాశ్రయాలు, పవర్ ట్రాన్స్‌మిషన్‌, మైనింగ్‌, గ్రీన్‌ ఎనర్జీ, గ్యాస్‌ పంపిణీ, ఎడిబుల్‌ ఆయిల్‌... భారత్‌లో ఏది జరిగినా ప్ర‌భుత్వానికి .. అంబానీ.. అదానీలే కనిపిస్తారని రాహుల్ ఎద్దేవా చేశారు.  మ‌రో వైపు దేశంలో పెట్రోకెమికల్స్, టెలికాం, రిటైల్, ఈకామర్స్‌లో  అంబానీ గుత్తాధిపత్యం పెరుగుతోంద‌ని విమ‌ర్శించారు.
 
 గత ఐదేళ్లలో తయారీ రంగ ఉద్యోగాలు 46% తగ్గాయి. పెద్ద పరిశ్రమతో నాకు సమస్య లేదు కానీ అవి మీకు ఉద్యోగాలు సృష్టించలేవని అనుకుంటున్నాను. చిన్న మధ్యతరహా పరిశ్రమలు మాత్రమే ఉద్యోగాలను సృష్టించగలవు. 27 కోట్ల మందిని దగ్గరి నుంచి తీసుకున్నామని రాహుల్ చెప్పారు. అదే సమయంలో, మోడీ ప్రభుత్వం 23 కోట్లను తిరిగి పేదరికంలోకి నెట్టింది.

యావత్ భారతదేశంలోని యువత ఉపాధి కోసం చూస్తున్నారని రాహుల్ అన్నారు. క‌రోనా క‌ష్ట కాలంలో దేశంలో మూడు కోట్ల మంది యువత ఉపాధి కోల్పోయారని, 50 ఏళ్లలో ఇది అత్యధిక నిరుద్యోగమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  జనాభాలో 84% ఆదాయం తగ్గిందని, అధికారిక రంగంలో గుత్తాధిపత్యం ఏర్పడుతోందని.. అన్నింటినీ ఒక వ్యక్తికి కట్టబెడుతున్నారని విమర్శించారు. భారతదేశంలోని 100 మంది ధనవంతులు 55 కోట్ల మంది కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారని పేద భారతదేశం చూడగలదని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu