తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఆదివారమే జరగనుంది. కానీ అనివార్య కారణాలతో మిజోరంలో కౌంటింగ్ ప్రక్రియను డిసెంబర్ 4 (సోమవారం)కు వాయిదా వేసింది ఎన్నికల సంఘం.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసింది. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ముగియడంతో నేతలు రిలాక్స్ అవుతుండగా, మరికొందరు ఆలయాల బాట పట్టారు. ఎగ్జిట్ పోల్స్‌లో సైతం ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు.. ఎన్ని ఓట్లు వస్తాయనే దానిపై అంచనాలను వెలువరించాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఆదివారమే జరగనుంది. కానీ అనివార్య కారణాలతో మిజోరంలో కౌంటింగ్ ప్రక్రియను డిసెంబర్ 4 (సోమవారం)కు వాయిదా వేసింది ఎన్నికల సంఘం. మిగిలిన 4 రాష్ట్రాల్లో మాత్రం కౌంటింగ్ యథాతథంగా జరుగుతుందని ఈసీ తెలిపింది.
The Election Commission announces a shift in the vote counting for the Mizoram Elections, now scheduled for December 4th (Monday) instead of December 3rd. pic.twitter.com/J3iBz1RD3D
— Digital Update India 🇮🇳 (@DigitalUpdateIN)
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేదీని మార్చాల్సందిగా వివిధ వర్గాలు, పలువురు ప్రజా ప్రతినిధులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం కావడంతో మిజోరం ప్రజలకు ప్రత్యేక ప్రాధాన్యత వుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకుని మిజోరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 4కు మార్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా.. మిజోరంలో నవంబర్ 7న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా.. 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం.
మరోవైపు.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) మరోసారి విజయం సాధిస్తుందని పలు సర్వేలు అంచనా వేయగా.. జోరమ్ పీపుల్స్ మూమెంట్ (జెడ్‌పీఎం)దే గెలుపని మరికొన్ని సంస్థలు పేర్కొన్నాయి. 40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ఎంఎన్ఎఫ్ ప్రస్తుతం అధికారంలో వుంది. గత ఈ ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలను గెలుచుకోగా.. ఈసారి మాత్రం ఈ సంఖ్య 18కి పరిమితమవుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి. కాంగ్రెస్ క్రితంసారి మాదిరిగానే 5 స్థానాలనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
మిజోరంలో పలు సంస్థల సర్వేల అంచనాలు ఇలా :
ఏబీపీ సీ ఓటర్ : ఎంఎన్ఎఫ్ 15 - 21 , జెడ్‌పీఎం 12 - 18, కాంగ్రెస్ 2 - 8
జన్‌కీ బాత్ : ఎంఎన్ఎఫ్ 10 - 14, జెడ్‌పీఎం 15 - 25, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 5 - 9
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ : ఎంఎన్ఎఫ్ 14 -18, జెడ్‌పీఎం 12 - 16, బీజేపీ 0 - 2, కాంగ్రెస్ 8 - 10
పీపుల్స్ పల్స్ సర్వే : ఎంఎన్ఎఫ్ 16 -20, జెడ్‌పీఎం 10 - 14, బీజేపీ 6 - 10, కాంగ్రెస్ 2 - 3
టైమ్స్‌నౌ ఈటీజీ : ఎంఎన్ఎఫ్ 14 - 18, జెడ్‌పీఎం 10 - 14, ఇతరులు 9 - 15