Voter ID Card: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 17 ఏళ్లకే Voter ID కి అప్లై చేయొచ్చు..

Published : Jul 28, 2022, 02:16 PM ISTUpdated : Jul 28, 2022, 02:21 PM IST
Voter ID Card: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. 17 ఏళ్లకే Voter ID కి  అప్లై చేయొచ్చు..

సారాంశం

Voter ID Card: కేంద్ర‌ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట‌ర్ ఐడీ అప్లై చేసుకునే వారు.. 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, 17 ఏళ్లు నిండిన యువత కూడా ఓటర్‌ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం వీలు కల్పించింది.

Voter ID Card: కేంద్ర‌ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాల‌న్న‌, లేదా ఓట‌ర్ ఐడీ పొందాలన్న ప్ర‌తి పౌరుడు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. న‌మోదు చేయాల‌నుకునే వారు..  జనవరి 1 నాటికి 18 యేండ్ల నిండి వాళ్లు మాత్రమే ఓటు హ‌క్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ వెసులుబాటు క‌ల్పించింది.18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, 17 ఏళ్లు నిండిన యువత కూడా ఓటర్ ఐడీ కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 
 
ఈ మార్పు ప్ర‌కారం.. 17 ఏళ్లు నిండిన.. ప్ర‌తిపౌరుడు ఓటరు ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేర‌కు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే నేతృత్వంలోని కమిషన్ యువత సంవత్సరానికి మూడుసార్లు ముందస్తు దరఖాస్తులను దాఖలు చేయడానికి సాంకేతిక పరిష్కారాలను రూపొందించాలని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్య నిర్వహణాధికారులను ఆదేశించింది.

ఏడాదిలో మూడుసార్లు ఛాన్స్.. 

యువత కేవలం జనవరి 1నే కాకుండా.. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. ఇక నుంచి ప్రతి త్రైమాసికానికి ఒక్క‌సారి ఓటర్‌ జాబితాను అప్డేట్‌ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్‌ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  

ప్రస్తుత ఓటరు జాబితా సవరణలో కూడా యువత దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత యువతకు ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) జారీ చేయబడుతుందని పేర్కొంది. ఓటరు జాబితా 2023 కోసం ఈ సమయంలో సవరణలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ముందస్తు దరఖాస్తును సమర్పించవచ్చు.

ఎన్నికల సంఘం సిఫారసుల మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల RP చట్టాన్ని సవరించింది. ఆర్‌పీ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్‌ ఎలక్టోర్స్ రూల్స్‌, 1960 చట్టాల్లో మార్పులు చేసింది. కొత్త అప్లికేష‌న్లు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. జనవరి 01, ఏప్రిల్ 01, జూలై 01, అక్టోబర్ 01 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు కేవ‌లం జనవరి 1ని మాత్రమే అర్హత తేదీగా పరిగణించేవారు. 

ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు అనుసంధానం 

మరోవైపు ఆధార్ కార్డుకు సంబంధించి, ఓటరు జాబితా డేటాతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడానికి, సవరించిన రిజిస్ట్రేషన్ ఫారంలో ఓటర్ల ఆధార్ కార్డు వివరాలను సేకరించే నిబంధనను రూపొందించినట్లు కమిషన్ తెలిపింది. ఇప్పటికే ఉన్న ఓటర్ల ఆధార్ సంఖ్యను సంగ్రహించేందుకు కొత్త ఫారం-6బిని ప్రవేశపెట్టారు. ఏదేమైనప్పటికీ, ఓటరు జాబితాలో పేరును చేర్చడానికి ఎటువంటి దరఖాస్తు తిరస్కరించబడదు. ఆధార్ కార్డుతో ఓట‌ర్ ఐడీ అనుసంధానమ‌నేది ఐచ్ఛిక‌మ‌ని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం