Adhir Ranjan Chowdhury Remark: ఆయ‌న ఎప్పుడో క్ష‌మాప‌ణ‌లు చెప్పారు?: సోనియా గాంధీ

Published : Jul 28, 2022, 12:55 PM IST
Adhir Ranjan Chowdhury Remark: ఆయ‌న ఎప్పుడో క్ష‌మాప‌ణ‌లు చెప్పారు?: సోనియా గాంధీ

సారాంశం

Adhir Ranjan Chowdhury Remark: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును రాష్ట్ర‌ప‌త్ని అని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ అవ‌మానించార‌ని, ఈ విష‌యంలో కాంగ్రెస్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విష‌యంలో ఇవాళ పార్ల‌మెంట్‌లో దుమారం రేగింది. ఈ అంశంపై సోనియాగాంధీ స్పందించారు. అధిర్ ఎప్పుడో క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని సోనియా గాంధీ అన్నారు.

Adhir Ranjan Chowdhury Remark: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ  కామెంట్ చేయ‌డంతో ఇవాళ పార్ల‌మెంట్‌లో తీవ్ర దుమారం రేగింది. ఆయ‌న‌ చేసిన కామెంట్స్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. 

అధిర్ రంజాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర‌ప‌తిని తీవ్రంగా అవమానించిందని అన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో మహిళను ఆదివాసీ విరోధి కాంగ్రెస్.. మహిళా విరోధి కాంగ్రెస్.. గరీబ్ విరోధి కాంగ్రెస్.. తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. భారత తొలి మహిళా గిరిజన అధ్యక్షురాలిని అవమానించినందుకు సోనియా గాంధీ దేశానికి, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని అన్నారు.

సోనియా గాంధీ కూడా కావాలనే ద్రౌపది ముర్ము అవమానించార‌ని  లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ద్రౌపది ముర్మును తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమెను తీవ్రంగా అమానించారని, కాంగ్రెస్ నాయకులు ఆమెను తోలుబొమ్మ,  చెడుకు చిహ్నం అని  కామెంట్ చేస్తున్నారని అన్నారు.

మ‌రోవైపు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు స్వయంగా వారి పార్టీ నేత అలా మాట్లాడటానికి అనుమతించార‌నీ, వారు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ స్పందించారు. ఆమెను మీడియా ప్ర‌శ్నించ‌గా.. అధిర్ ఎప్పుడో క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని సోనియా అన్నారు. 

ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార పక్షం చేసిన పెద్దఎత్తున నినాదాలు, నినాదాలతో లోక్‌సభ వాయిదా పడింది. చ‌ర్చ‌ల నుంచి విప‌క్షాలు దూరంగా ఉండాల‌ని భావిస్తున్నాయ‌ని, చ‌ర్చ‌లో పాల్గొనేందుకు మంత్రి సీతారామ‌న్ స‌భ‌కు వ‌చ్చిన‌ట్లు మంత్రి ప్ర‌హ్లాద్ జోషి వెల్ల‌డించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం