వృద్ధుడికి నాలుగు డోసుల టీకా... తరువాతేమయిందంటే..

By AN TeluguFirst Published Aug 2, 2021, 10:49 AM IST
Highlights

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ లో జరుగుతున్న టీకాలు వేసే ప్రక్రియలో ఘోర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఈ ఉదంతం భోజ్ పూర్ జిల్లాలోని సహార్ ప్రాంతంలో జరిగింది. ఒక వృద్ధునికి ఏకంగా నాలుగు డోసుల కరోనా టీకా వేశారు. 

ఓ వైపు వ్యాక్సిన్ల కొరతతో జనాలు అల్లాడుతుంటే.. మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యాక్సిన్లు వృధా అవుతున్నాయి. మొదటి డోసు వేసుకున్నవారికి రెండో డోసు దొరకడం లేదు.. 18యేళ్ల లోపు వారికి మొదటి డోసుకు తీవ్ర కొరత ఉంది. అయితే కొన్ని చోట్ల వైద్య సిబ్బంది తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఘటనే బీహార్ లో చోటు చేసుకుంది. ఓ వృద్ధుడికి ఏకంగా 4 డోసుల టీకా వేశారు. 

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ లో జరుగుతున్న టీకాలు వేసే ప్రక్రియలో ఘోర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ఈ ఉదంతం భోజ్ పూర్ జిల్లాలోని సహార్ ప్రాంతంలో జరిగింది. ఒక వృద్ధునికి ఏకంగా నాలుగు డోసుల కరోనా టీకా వేశారు. 

ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో స్థానిక ఆరోగ్య విభాగంలో కలకలం చెలరేగింది. ఉన్నతాధికారులు ఈ ఘటనమీద విచారణ ప్రారంభించారు. కాలోడీహారి గ్రామానికి చెందిన రామ్ దురారీసింగ్ (76)కు నాలుగు డోసుల టీకా వేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రామ్ దులార్ సింగ్ కు ఫిబ్రవరి 23న ఆమ్ హరూవా ఆరోగ్య కేంద్రంలో మొదటి డోసు టీకా వేశారు.

ఏప్రిల్ 18న రెండవ డోసు టీకా వేశారు. అయితే.. ఆ తరువాత మార్చి 23న వృద్ధుడు సహార్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లగా, మరోమారు టీకా వేశారు. తిరిగి జూన్ 16న కూడా ఇంకో డోసు టీకా వేశారు. ఇలా మొత్తం నాలుగుసార్లు ఆ వృద్ధుడు  కోవిడ్ టీకా వేయించుకున్నాడు. ఈ ఉదంతం మీద ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!