బీజేపీపై 22 మంది MLAల, 9 మంది MPల అసంతృప్తి.. ఏక్‌నాథ్ శిండే‌ పార్టీకి రిజైన్ చేయాలనుకుంటున్నారు:సామ్నా సంచలనం

By Mahesh KFirst Published May 30, 2023, 4:06 PM IST
Highlights

మహారాష్ట్రలో అధికార కూటమికి బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ తమతో సరిగా వ్యవహరించడం లేదని, ఏక్‌నాథ్ షిండే పార్టీని వీడాలని 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు భావిస్తున్నట్టు ఉద్దవ్ ఠాక్రే పార్టీ మౌత్ పీస్ సామ్నా పేర్కొంది.
 

ముంబయి: శివసేన (యూబీటీ) మౌత్ పీస్ సామ్నా సంచలన కథనం ప్రచురించింది. ఏక్‌నాథ్ షిండే టీమ్‌లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బీజేపీపై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొంది. ఆయనను వీడాలని అనుకుంటున్నట్టు భావిస్తున్నారని వివరించింది. ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచనలు చేస్తున్నారని తెలిపింది.

శివసేన (యూబీటీ) ఎంపీ వినాయక్ రౌత్ మాట్లాడుతూ.. వారంతా తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఏక్‌నాథ్ షిండే పార్టీని వదిలిపెట్టాలని అనుకుంటున్నారని అన్నారు. వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి లేదని, అందుకే అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏక్‌నాథ్ షిండె పార్టీ వీడాలని ఆలోచనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

శివసేన సీనియర్ లీడర్ గజానన్ కిర్తికర్ వంటి నేతలూ ఏక్‌నాథ్ షిండే టీమ్, బీజేపీ కూటమిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. బీజేపీ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సామ్నా సోమవారం రిపోర్ట్ చేసింది.

దీంతో బీజేపీ, శివసేన కూటమిలో అన్నీ సజావుగా ఏమీ లేవని తెలుస్తున్నది. బీజేపీ తమ పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదని కిర్తికర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మేం 13 మంది ఎంపీలం. ఇప్పుడు మేం ఎన్డీఏ కూటమి సభ్యులం. అందుకే మా నియోజకవర్గాల్లో సమస్యలు వేగంగా సఫలం అవుతాయని ఆశించాం. కానీ, అలాంటివేమీ ఇప్పుడు జరగడం లేదు’ అని గజానన్ కిర్తికర్ తెలిపారు.

Also Read: తన లవర్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని సల సల కాగే వేడి నీటిని మీద పోసింది.. కేసు నమోదు

లోక్‌సభ ఎన్నికల్లో శివసేన పార్టీ 22 స్థానాల్లో పోటీ చేయా లని భావిస్తున్నది. ‘ఆత్మగౌరవం, గౌరవాన్ని డబ్బుతో కొనుగోలు చేయలేమని మరోసారి నిరూపణ అయింది. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 22 స్థానాల్లో పోటీ చేయాలని భా విస్తున్నది. ఇందుకోసం శివసేన బీజేపీ నుంచి సీట్ల కోసం అడిగింది. కానీ, ఈ శిబిరానికి బీజేపీ ఆరు నుంచి ఏడు సీట్లు కూడా ఇవ్వడానిచి బీజేపీ సిద్ధంగా లేదు.’ అని సామ్నా పత్రిక రిపోర్ట్ చేసింది.

click me!