ముంబైలోని శివారులో బోరివాలిలో వీణా సంతూర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీలో సోమవారంనాడు అగ్ని ప్రమాదం జరిగింది.
ముంబై: ముంబైలోని శివారులో బోరివాలిలో వీణా సంతూర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీలో సోమవారంనాడు అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో మైనర్ సహా ఇద్దరు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గ్లోరీ వాల్పాతి, జోసు జెమ్స్ రాబర్ట్ గా గుర్తించారు. లక్ష్మీ బురా, రాజేశ్వరి భర్తరే, రంజన్ షాలు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కందివాలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి 40 నుండి 50 శాతం గాయాలయ్యాయి.
also read:తొమ్మిది అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు..
ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎనిమిది అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనం మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. తొలి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోట ప్రతి రోజూ అగ్ని ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు నమోదౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ నారాయణగూడలో హస్టల్ లో ఈ నెల 20వ తేదీన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హస్టల్ కు చేరుకుని మంటలను ఆర్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో ఓ వస్త్ర పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూ. 400 కోట్ల ఆస్తి నష్టపోయింది.జిల్లాలోని ఇంకొల్లు సమీపంలోని ఎన్ఎస్ఎస్ వస్త్ర పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నెల 20వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని కోరమంగళలోని తావరెకెరె మెయిన్ రోడ్డులోని నాలుగో అంతస్థులో ఈ నెల 16న అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి తప్పించుకొనేందుకు ఓ వ్యక్తి భవనంపై నుండి దూకాడు.ఈ నెల 16న ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ఫర్నీచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది.