అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఖండించిన ఎడిటర్స్ గిల్డ్, జర్నలిస్ట్ యూనియన్

By narsimha lodeFirst Published Nov 4, 2020, 12:20 PM IST
Highlights

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ చేయడాన్ని  ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. బుధవారం నాడు ఉదయం గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ చేయడాన్ని  ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. బుధవారం నాడు ఉదయం గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గోస్వామిని అరెస్ట్ చేయడాన్ని ఓ ప్రకటనలో ఎడిటర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ప్రెస్ అసోసియేషన్  కూడ ఈ అరెస్ట్ ను తప్పుబట్టింది.

The Editors Guild of India has issued a statement on the arrest of Arnab Goswami, editor-in-chief of Republic TV. pic.twitter.com/gL3MstVlla

— Editors Guild of India (@IndEditorsGuild)

ఇవాళ ఉదయం ముంబై పోలీసులు అర్నబ్ ను అరెస్ట్ చేయడం షాక్ కు గురిచేసినట్టుగా  ఎడిటర్స్ గిల్డ్ తెలిపింది.  రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ కు వ్యతిరేకంగా ఉపయోగించిందని ఎడిటర్స్ గిల్డ్ ఆరోపించింది.

గోస్వామిని ఇవాళ ఉదయం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేశారు. అర్నబ్ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు తనపై దాడి చేశారని గోస్వామి ప్రకటించారు. తన కుటుంబసభ్యులతో కలవకుండా చేశారని ఆయన ప్రకటించారు. తన కొడుకుపై కూడ దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.


నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఖండన

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్  చేయడాన్ని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.యూనియన్ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు రాస్ బీహర్, ప్రసన్నకుమార్ మహంతిలు ఈ విషయమై ఓ ప్రకటన విడుదల చేశారు.

 

ముంబై పోలీసులు బలవంతంగా గోస్వామి ఇంట్లోకి వెళ్లారు. ఎలాంటి నోటీసులు, సమన్లు ఇవ్వకుండా వెళ్లడం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన గైడ్‌లైన్స్ కు విరుద్దమని పేర్కొన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను దుర్వినియోగం చేయడం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను, అణచివేసే ప్రయత్నంగా కన్పిస్తోందన్నారు.ప్రజాస్వామ్యంలోని నాలుగవ పిల్లర్ గా ఉన్న మీడియాపై పోలీసు బలగాన్ని ప్రయోగించడం చాలా ప్రమాదకరంగా పేర్కొన్నారు.

also read:అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఎమర్జెన్సీ గుర్తుకొస్తుందన్న అమిత్ షా

వైద్య సలహా కోసం పోలీసులకు చేసిన వినతిని వారు పట్టించుకోలేదని టీవీ పుటేజీలో కన్పించిందన్నారు. కనీసం తమ న్యాయవాదుల నుండి న్యాయపరమైన అభిప్రాయం కోసం ఆయన  ప్రార్ధనను కూడ పోలీసులు పట్టించుకోలేదన్నారు. వైద్య సలహా కోసం ఆయన వినతిని పట్టించుకోకపోవడం అమానవీయమైందని  పేర్కొన్నారు.

click me!