అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఎమర్జెన్సీ గుర్తుకొస్తుందన్న అమిత్ షా

Published : Nov 04, 2020, 11:40 AM IST
అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఎమర్జెన్సీ గుర్తుకొస్తుందన్న అమిత్ షా

సారాంశం

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు.ఈ ఘటన ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాపై దాడిని ఆయన ఖండించారు.

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు.ఈ ఘటన ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాపై దాడిని ఆయన ఖండించారు.

also read:ఆర్నబ్ గోస్వామి అరెస్ట్ ! తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసు..

కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీకి చెందిన మిత్రపక్షాలు ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్నారు.అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాదు ఈ ఘటన ప్రజాస్వామ్యంలోని నాలుగో పిల్లర్ పై దాడిగా అభివర్ణించారు.

 

అర్నబ్ గోస్వామిని  బుధవారం నాడు ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో ఓ అర్కిటెక్ట్ అతని తల్లి ఆత్మహత్య చేసుకొన్నారు. గోస్వామి బకాయిలు చెల్లించని కారణంగానే ఈ ఆత్మహత్యలు చేసుకొన్నట్టుగా కేసు నమోదైంది.

ఈ కేసులో ఇవాళ అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !