లిక్క‌ర్ పాల‌సీ స్కామ్ లో ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు ఈడీ సమన్లు.. బీజేపీపై విరుచుకుప‌డ్డ సిసోడియా

By team teluguFirst Published Sep 19, 2022, 12:44 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు ఈడీ సమన్లు పంపించింది. ఈ తాజా పరిణామంపై మనీష్ సిసోడియా బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ స్కామ్ వ‌ల్ల ఆమ్ ఆద్మీ పార్టీ లో స‌మ‌స్య‌ల్లో ఇరుక్కుంటోంది. మ‌నీష్ సిసోడియాపై మొద‌లైన ఈ అవినీతి ఆరోప‌ణ‌లు ఇప్పుడు మ‌రో నేత‌ను కూడా తాకాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే,  మునిసిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ దుర్గేష్ పాఠక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా స‌మ‌న్లు జారీ చేసింది. దీంతో ఆయ‌న సోమ‌వారం ఉద‌యం విచార‌ణ కోసం ఈడీ ఆఫీసుకు వ‌చ్చారు. 

70ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా గురు గ్రహం...!

ఈ పరిణామాల‌పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. బీజేపీపై విరుచుకుప‌డ్డారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో పాఠక్‌కు ఎలాంటి సంబంధాలు లేవని సిసోడియా పేర్కొన్నారు. ఎంసీడీ ఎన్నికలకు మరికొద్ది నెలల్లోనే ఉన్నందున, రాజకీయ పగతో బీజేపీ ఆయ‌న‌ను టార్గెట్ చేసిందని ఆరోపించారు.

“ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన MCD ఎన్నికల ఇన్‌ఛార్జ్ దుర్గేష్ పాఠక్‌ను ఈడీ పిలిచింది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీకి మా MCD ఎన్నికల ఇన్‌ఛార్జ్‌కి సంబంధం ఏమిటి? వారి లక్ష్యం మద్యం పాలసీనా లేక MCD ఎన్నికలా? ’’ అంటూ సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు.

आज ED ने “आप” के MCD के चुनाव इंचार्ज दुर्गेश पाठक को समन किया है। दिल्ली सरकार की शराब नीति से हमारे MCD चुनाव इंचार्ज का क्या लेना देना? इनका टार्गेट शराब नीति है या MCD चुनाव?

— Manish Sisodia (@msisodia)

దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయం చేస్తోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. “ దుర్గేష్ పాఠక్ మునిసిపల్ కార్పొరేషన్ ఇన్‌చార్జి, ఎక్సైజ్ పాలసీని రూపొందించినప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు. ఆప్‌లో ముఖ్యమైన పదవుల్లో ఉన్న వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఇది తెలియజేస్తోంది.’’ అని ఆయన అన్నారు. 

ఇదేం పైశాచిక‌త్వం.. కుక్క‌ను కారుకు క‌ట్టి ఈడ్చుకెళ్లిన డాక్ట‌ర్.. వీడియో వైర‌ల్.. ఎక్క‌డ జరిగిందంటే ?

కాగా.. దుర్గేష్ పాఠక్ ఆప్ వర్ధమాన నాయకుడు. రాఘవ్ చద్దా పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయిన ఢిల్లీలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానం నుంచి దుర్గేష్‌ను పార్టీ పోటీకి దింపింది.ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో ఓడించి పార్టీ విశ్వసనీయతను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల బాధ్యతను పార్టీ ఆయనకు అప్పగించింది.

అలప్పుజ నుండి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం

ఇదిలా ఉండ‌గా.. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో శుక్రవారం ఈడీ దాడులు చేసింది.ఒక్క హైదరాబాద్‌లోనే 25 చోట్ల సోదాలు జరిగాయి.దీంతో పాటు జైలులో ఉన్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను కూడా ప్రశ్నించారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు చేసింది. మద్యం కుంభకోణంపై గ‌త కొంత కాలంగా బీజేపీ, ఆప్ మధ్య వాగ్వాదం జరుగుతోంది.

click me!