హవాలా ఆరోపణలు.. జోయ్ ‌అలుక్కాస్ జ్యూవెలరీస్‌లో ఈడీ సోదాలు

Siva Kodati |  
Published : Feb 22, 2023, 03:47 PM IST
హవాలా ఆరోపణలు.. జోయ్ ‌అలుక్కాస్ జ్యూవెలరీస్‌లో ఈడీ సోదాలు

సారాంశం

దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అల్లూకాస్‌లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్ట్‌కు నిధులు మళ్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని హవాలా మార్గంలో తరలించినట్లుగా తెలుస్తోంది. 

దేశంలోని ప్రముఖ ఆభరణాల సంస్థ జోయ్ అల్లూకాస్‌లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.  ఈ సంస్థ రూ.300 కోట్ల నగదును బదిలీ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. హవాలా ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు . 25 ఎకరాల్లో నిర్మించబోయే ప్రాజెక్ట్‌కు నిధులు మళ్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని హవాలా మార్గంలో తరలించినట్లుగా తెలుస్తోంది. సెబిలో రూ.2 వేల కోట్ల ఐపీఓకి జోయ్ అలుక్కాస్ దరఖాస్తు చేసింది. అయితే ఉన్నట్లుండి ఐపీవోను జోయ్ అలుక్కాస్ సంస్థ ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial