ఢిల్లీ నూతన మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఎవరు? ఆమె గురించి కీలక వివరాలు ఇవే

Published : Feb 22, 2023, 03:39 PM IST
ఢిల్లీ నూతన మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఎవరు? ఆమె గురించి కీలక వివరాలు ఇవే

సారాంశం

ఢిల్లీ నూతన మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ గెలిచారు. 39 ఏళ్ల షెల్లీ ఒబెరాయ్ గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేశారు. ఐఐఎం కోళికోడ్‌లో మేనేజ్‌మెంట్ కంప్లీట్ చేవారు.  

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కోసం కొన్ని రోజులుగా రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ కీలక ఎన్నికలో షెల్లీ ఒబెరాయ్ పోరాడి గెలిచారు. ఇప్పుడు ఢిల్లీ నూతన మేయర్‌గా ఆమెనే. బీజేపీ అభ్యర్థిపై 34 ఓట్ల ఆధిక్యతతో పై చేయి సాధించారు. రాజకీయంగా ఈ ఎన్నికకు ఎదురైన సవాళ్లను ఆమె సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే షెల్లీ ఒబెరాయ్ గురించి ఆసక్తి నెలకొంది. ఆమె గురించి కొన్ని కీలక విషయాలు చూద్దాం.

1. షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ యూనివర్సిటీలో గతంలో ప్రొఫెసర్‌గా చేశారు. ఈస్ట్ పటేల్ నగర్ వార్డ్ నుంచి తొలిసారిగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

2. 39 ఏళ్ల షెల్లీ ఒబెరాయ్ కోళికోడ్ ఐఐఎంలో మేనేజ్‌మెంట్ చదివారు.

3. 2014 నుంచి ఆమెకు ఆప్‌తో సంబంధాలున్నాయి.  2020లో ఆప్ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా రేసులో ఉన్నారు.

4. ఆమె లింక్‌డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె ఇండియన్ కామర్స్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యులు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)కి చెందిన స్కూల్ ఆప్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆమె పలు కాన్ఫరెన్స్‌లలో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

Also Read: ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌ సొంతం.. నూతన మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్..

5. షెల్లీ ఒబెరాయ్ తండ్రి సతీశ్ కుమార్ ఒక బిజినెస్‌మ్యాన్. ఆమె తల్లి సరోజ్ గృహిణి. షెల్లీ ఒబెరాయ్‌కు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం