
జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆ పార్టీ ఎమ్మెల్యే పంకజ్ మిశ్రా నివాసం, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. జార్ఖండ్‌లోని మొత్తం 18 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పంకజ్ మిశ్రా సన్నిహితుడు హీరా భగత్ ఇంట్లో రూ.3 కోట్లు సీజ్ చేశారు అధికారులు. పంకజ్ మిహ్రా, దాహూ ఇళ్లల్లో ఈడీ తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సోదాల్లో మొత్తం 300 మంది ఈడీ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జార్ఖండ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.