
పశ్చిమ బెంగాల్‌లో (west bengal) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed raids) అధికారులు తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) నేతల అనుచరుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ చటర్జీ (partha chatterjee) అనుచరురాలు .. అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో దాదాపు 20 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ సర్వీస్ కమీషన్‌లో రిక్రూట్‌మెంట్‌లో భారీగా అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే 20 సెల్‌ఫోన్లు, కీలక పత్రాలు, కొన్ని రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు.
బెంగాల్ విద్యాశాఖకు సంబంధించి స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో ఈ రిక్రూట్ మెంట్ కుంభకోణం జరిగినట్టు భావిస్తున్నారు. ఎస్ఎస్ సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం చేపట్టే క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఈడీ రంగంలోకి దిగింది. అటు, పార్థ ఛటర్జీ నివాసంతో పాటు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదా చేశారు.