BS Yediyurappa: యడియూరప్ప సంచ‌ల‌న నిర్ణయం.. వార‌సుడి కోసం రాజ‌కీయాల‌కు స్వ‌స్తి!

Published : Jul 22, 2022, 07:35 PM ISTUpdated : Jul 22, 2022, 07:44 PM IST
BS Yediyurappa: యడియూరప్ప సంచ‌ల‌న నిర్ణయం.. వార‌సుడి కోసం రాజ‌కీయాల‌కు స్వ‌స్తి!

సారాంశం

Karnataka Former CM BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన కుమారుడి కోసం సంప్రదాయ అసెంబ్లీ సీటును వదులుకోనున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు బీవై విజయేంద్ర కోసం శికారిపుర సీటును వదులుకుంటున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. 

Karnataka Former CM BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్ప సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తన అసెంబ్లీ నియోజక వర్గం శివమొగ్గ జిల్లాలోని శికారిపురి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి తన కుమారుడి పోటీ చేస్తార‌ని త‌న‌ సంప్రదాయ సీటును వదులుకుంటానని యడియూరప్ప వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజయేంద్ర షికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. తన సీటును కూడా వదులుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజయేంద్రను ఆదరించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిర్ణ‌యంతో క‌ర్నాట‌క‌ రాజకీయ కారిడార్‌లో ప్రకంపనలు సృష్టించ‌బ‌డ్డాయి. యడ్యూరప్ప ప్రకటనతో ఆయన ఎన్నికల రాజకీయాలకు తెరపడినట్లేనని భావిస్తున్నారు.

నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: మాజీ సీఎం

నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. విజయేంద్ర శికారిపుర నుంచి పోటీ చేయనున్నారు. శికారిపుర ప్రజలు నా కంటే ఎక్కువగా నా కొడుకును ఆదరించి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ముకుళిత హస్తాలతో అభ్యర్థిస్తున్నాను. పాత మైసూరు ప్రాంతం నుంచి విజయేంద్రను పోటీ చేయాలన్న డిమాండ్ గురించి అడగ్గా, అక్కడి నుంచి పోటీ చేయాలని తనపై చాలా ఒత్తిడి ఉందని, అయితే నేను సీటును ఖాళీ చేస్తున్నాను, ఎన్నికల్లో పోటీ చేయనని యడియూరప్ప అన్నారు. దీంతో విజయేంద్ర శికారిపుర నుంచి పోటీ చేయనున్నారు.

షికారిపుర నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా  

య‌డియూర‌ప్ప కు షికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం కంచుకోట‌. ఆయ‌ను ఈ నియోజ‌క వ‌ర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ షికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందుతున్నారు. ఒక‌సారి 1999లో ఈ స్థానం నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు. యడ్యూరప్ప చేసిన ఈ ప్రకటన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విజయేంద్ర కర్ణాటక యూనిట్ వైస్ ప్రెసిడెంట్.

విజయేంద్ర జులై 2020లో బీజేపీ కర్ణాటక యూనిట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మైసూరులో వరుణ నుండి టికెట్ నిరాకరించబడిన కొద్దికాలానికే ఆయన బిజెపి యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019లో కేఆర్‌పేట్‌, 2020లో సీరా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో పార్టీలో ఆయన స్థాయి పెరిగింది.

అవినీతి కేసులో ఊరట...

మరోవైపు అవినీతి కేసులో యడ్యూరప్పకు సుప్రీం కోర్టు నుంచి ఊర‌ట ల‌భించింది.  బీఎస్ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలపై తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలను పిటిషన్‌లో సవాలు చేశారు. ఈ క్ర‌మంలో ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం రిలీఫ్ ఇచ్చింది. ఆయ‌న‌పై ఉన్న‌ క్రిమినల్ ప్రోసిడింగ్స్‌లను నిలిపివేయాల‌ని, కానీ, భూ కేటాయింపుల కుంభకోణంలో ఆయ‌న‌ పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families