BJP MP Ravi Kishan:  జనాభా నియంత్రణ బిల్లుకు పిలుపునిచ్చిన బీజేపీ ఎంపీ రవి కిషన్.. సోష‌ల్ మీడియాలో ట్రోల్!

Published : Jul 22, 2022, 08:20 PM IST
BJP MP Ravi Kishan:  జనాభా నియంత్రణ బిల్లుకు పిలుపునిచ్చిన బీజేపీ ఎంపీ రవి కిషన్.. సోష‌ల్ మీడియాలో ట్రోల్!

సారాంశం

BJP MP Ravi Kishan on Population Control Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టడంపై బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన ప్రకటన తెరపైకి వచ్చింది. దీని కారణంగా ప్రజలు అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

BJP MP Ravi Kishan on Population Control Bill: జనాభా నియంత్రణ బిల్లు విష‌యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, నటుడు రవి కిషన్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గుర‌వుతున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనాభా నియంత్రణపై ప్రైవేట్ మెంబర్స్ బిల్లును ప్రవేశపెడతామన్నారు. జనాభా నియంత్రణకు సంబంధించి ఈ బిల్లు ఎంతో కీలకమైందన్నారు.  

అలాగే.. జనాభా నియంత్రణ చట్టం వచ్చినప్పుడే మనం విశ్వ గురువు కాగలమని అన్నారు. జనాభా నియంత్రణ చాలా ముఖ్యమ‌నీ, జనాభా పెరుగుతున్న తీరు విస్ఫోటనం దిశగా పయనిస్తోందన్నారు. విపక్షాలను అభ్యర్థించగా, ప్రతిపక్షాలు ఒకసారి బిల్లును ప్రవేశపెట్టాలని, ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చర్చించాలని అన్నారు. 

బీజేపీ ఎంపీ రవి కిషన్ పై ట్రోల్

జనాభా నియంత్రణ బిల్లు గురించి బీజేపీ ఎంపీ రవి కిషన్ ప్ర‌స్త‌వించ‌డంపై సోషల్‌ మీడియాలో ట్రోల్ చేశారు. 4 పిల్లల తండ్రి జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.  వాస్త‌వానికి ఎంపీ రవికిషన్ కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకున్న సంగతి తెలిసిందే. అందుకే నలుగురు పిల్లల తండ్రి జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతున్నారంటూ బీజేపీ ఎంపీ రవికిషన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఓ నెటిజ‌న్ ఈ అంశంపై ట్వీట్ చేస్తూ...మీరు 4 పిల్లలకు తండ్రి.. మీరు ఈ బిల్లు తీసుక‌రావ‌డ‌మేంటీ? అని ఏద్దేవా చేశారు. మ‌రో నెటిజ‌న్ మీరు జనాభా నియంత్రణ బిల్లుపై ఉపన్యాసాలు ఇస్తున్నారు. కాబట్టి ఆ పాస్ అయితే.. 4 పిల్లలలో 2 పిల్లలను ఎంచుకోవలసి ఉంటుంది. జాగ్ర‌త‌ అని కామెంట్ చేశారు. 
 
జనాభా నియంత్రణ బిల్లుపై ప్రభుత్వం వివ‌ర‌ణ‌ 

జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని మంగళవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఈ సమాచారాన్ని అందించారు. 2045 నాటికి జనాభా స్థిరీకరణ లక్ష్యంతో జాతీయ జనాభా విధానం (2000), జాతీయ ఆరోగ్య విధానం (2017) సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పవార్ చెప్పారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం.. 2019-21లో టోటల్ ఫెర్టిలిటీ రేర్ (TFR) 2.0కి తగ్గిందని, ఇది భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉందని పవార్ చెప్పారు. భారతదేశంలో పెరుగుతున్న జనాభా పెరుగుదలకు చెక్ పెట్టేందుకు చట్టాలను తీసుకురావాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌తో సహా పలువురు బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 2023 నాటికి భారతదేశ జనాభా చైనాను అధిగమిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు