ED raids Gupta Builders: గుప్తా బిల్డ‌ర్స్ పై ఈడీ దాడులు.. భారీ మొత్తంలో న‌గ‌దు, ఆస్తులు స్వాధీనం

Published : Jun 07, 2022, 02:04 PM IST
 ED raids Gupta Builders:  గుప్తా బిల్డ‌ర్స్ పై  ఈడీ దాడులు..  భారీ మొత్తంలో న‌గ‌దు, ఆస్తులు స్వాధీనం

సారాంశం

ED raids Gupta Builders:  గుప్తా బిల్డ‌ర్స్ అండ్ ప్ర‌మోట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌(ఈడీ) సోదాలు నిర్వ‌హించింది. సుమారు 19 చోట్ల త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. చండీఘ‌డ్‌, అంబాలా, పంచ‌కుల‌, మొహాలీ, ఢిల్లీలో ఉన్న గుప్తా బిల్డ‌ర్స్ ఆఫీసుల్లో సోదాలు జ‌రిగాయి.  

ED raids Gupta Builders:  గుప్తా బిల్డర్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌(ఈడీ) సోదాలు నిర్వ‌హించింది. అదే స‌మయంలో చండీగఢ్, అంబాలా, పంచకుల, మొహాలీ, ఢిల్లీలోని 19 ప్రదేశాలలో ఉన్న గుప్తా బిల్డ‌ర్స్ ఆఫీసుల్లో త‌నిఖీలు జ‌రిగాయని ఈడీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆ సంస్థ డైర‌క్ట‌ర్లను ఈడీ విచారిస్తోంది. ఈ సోదాల్లో భారీ స్థాయిలో డాక్యుమెంట్ల‌ను, సుమారు 85 ల‌క్ష‌ల న‌గ‌దు, ఆడి కూ7(Audi car)  కారును స్వాధీనం చేసుకున్నారు. శుక్ర‌వారం ఈ సోదాలు జ‌రిగినట్లు తెలిపారు.

అలాగే.. గుప్తా బిల్డ‌ర్స్ డైరెక్ట‌ర్లు సతీష్ గుప్తా, పర్దీప్ గుప్తా, వారి సహచరులు బజ్వా డెవలపర్స్ లిమిటెడ్, కుమార్ బిల్డర్స్, విన్మెహతా ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లపై జూన్ 3న సోదాలు జరిగాయి. అదేవిధంగా..  డైరెక్టర్లు జర్నైల్ సింగ్ బజ్వా, నవరాజ్ మిట్టల్, విశాల్ గార్గ్‌ల‌తో పాటు ఇత‌రుల ఇండ్ల‌ల్లో సోదాలు జ‌రిగాయి
 
చంఢీఘ‌డ్‌లో గుప్తా బిల్డ‌ర్స్‌పై మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు అయ్యింది. సుమారు 325 కోట్ల మేర మోసం జ‌రిగిన‌ట్లు ఈడీ గుర్తించింది.  ప్లాట్లు లేదా క‌మ‌ర్షియ‌ల్ భ‌వ‌నాల‌ను ఇవ్వ‌కుండా.. వినియోగ‌దారుల నుంచి భారీ మొత్తంతో సోమ్మును తీసుకున్నార‌ని ఆరోప‌ణ‌లున్నాయి. గృహ కొనుగోలుదారులు/పెట్టుబడిదారుల నుంచి సేక‌రించిన సొమ్మును ఇత‌ర కంపెనీల‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన‌ట్లు ఈడీ గుర్తించింది.

దాడుల సమయంలో చరాచర. స్థిరాస్తులకు సంబంధించిన నేరారోపణ పత్రాలు, లెక్కలో చూపని రూ. 85 లక్షల నగదు, ఒక ఆడి క్యూ7 కారును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ  తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?
VB-G RAM G : కూలీలకు నిరుద్యోగ భృతి.. అందకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి