మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఈడీ ప్రశ్నలు.. 5 గంటలపాటు విచారణ

By telugu teamFirst Published Aug 30, 2021, 7:13 PM IST
Highlights

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. కనీసం ఐదు గంటలపాటు ఆమెను విచారించారు. సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఆమెను సాక్షిగా విచారించారు. ఆమె నిందితురాలు కాదని అధికారవర్గాలు తెలిపాయి.
 

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఐదు గంటలపాటు విచారించింది. సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ చేసులో ఆమె నిందితురాలు కాదు. కేవలం సాక్షిగా మాత్రమే ఆమెను ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తున్నది.

36ఏళ్ల ఈ శ్రీలంకన్ బామ నిందితురాలు కాదని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఏడాది కాలంలో 200 కోట్ల బలవంతపు వసూళ్లు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన కేసులో ఈడీ ముమ్మర దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే చెన్నైలోని సీఫేస్ భారీ బంగ్లా(సుమారు రూ. 10 కోట్లు విలువ)ను సీజ్ చేసింది. అక్కడి నుంచి 82.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. అంతేకాదు, కనీసం 12 లగ్జరీ కార్లను సీజ్ చేసింది. రూ. 200 కోట్ల ఫ్రాడ్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కేసు నమోదు చేసింది.

17ఏళ్ల నుంచి సుకేశ్  చంద్రశేఖర్ క్రైమ్ వరల్డ్‌లో ఉన్నారని, చాలా కేసుల్లో ఆయన మాస్టర్‌మైండ్ అని అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో భాగంగానే ఆయన రోహిణి జైలులో ఉన్నారు. ఆయన టీటీవీ దినకరన్ నుంచీ భారీగా పుచ్చుకుని ఏఐఏడీఎంకే అమ్మ చీలికకు రెండు ఆకుల సింబల్‌ను కొనసాగించేలా చేశారని ఆరోపణలున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌తో రూ. 50 కోట్ల డీల్ కుదిర్చి ఏఐఏడీఎంకే (అమ్మ) గ్రూప్‌నకు సహకరించారని వాదనలున్నాయి. సుకేశ్ చంద్రశేఖర్‌ను అరెస్టు చేస్తున్న సమయంలో ఆయన దగ్గర నుంచి రూ. 1.3 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

click me!