కర్ణాటక మంత్రి శివకుమార్ పై కేసు నమోదు...

By Arun Kumar PFirst Published Sep 18, 2018, 3:04 PM IST
Highlights

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు, మంత్రి డీకె శివకుమార్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసింది. మంత్రితో పాటు మరికొందరు మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు పేర్కొంటూ ఈయనపై కేసు నమోదు చేశారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో అలజడి మొదలైంది.

బెంగళూరు, డిల్లీ కేంద్రంగా హవాలా మార్గంలో భారీ మొత్తంలో నగదును శివకుమార్ తరలించేవాడని ఆరోపణలున్నాయి. ఈ విషయంలో అతడికి మరో నలుగురు సహకరించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మంత్రి సన్నిహితుడు ఎస్‌కె శర్మ, డిల్లీ కర్ణాటక భవన్ అధికారి హనుమంతయ్యతో పాటు మరో ఇద్దరిపై కూడా పీఎంఎల్ఏ చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులో విచారణ జరపడానికి వీరందరికి ఈడీ సమన్లు జారీచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణలో భాగంగానే వీరి వాంగ్మూలాన్ని కూడా ఈడీ  నమోదుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
click me!