స్కూలు విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్‌రేప్.. గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌కు యత్నించిన ప్రిన్సిపాల్

Published : Sep 18, 2018, 02:06 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
స్కూలు విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్‌రేప్.. గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌కు యత్నించిన ప్రిన్సిపాల్

సారాంశం

డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది.. 10వ తరగతి విద్యార్థినిపై సీనియర్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో విద్యార్థిని తన సోదరితో కలిసి చదువుకుంటోంది. 

డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది.. 10వ తరగతి విద్యార్థినిపై సీనియర్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. డెహ్రాడూన్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో విద్యార్థిని తన సోదరితో కలిసి చదువుకుంటోంది. ఈ క్రమంలో గత నెల 14న స్వాతంత్ర్య దినోత్సవం  ఏర్పాట్లపై మాట్లాడదామని సీనియర్ విద్యార్థులు బాలికను స్కూలు స్టోర్ రూమ్‌కి పిలిచారు.

అనంతరం ఆమెపై నలుగురు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన ఘోరం ఆమె ఎవ్వరికి చెప్పలేదు. కానీ గత నెల రోజుల నుంచి చెల్లెలు అదోలా ఉండటం.. లోలోపల కుమిలి పోతుండటంతో అక్క ప్రశ్నించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికే బాలిక గర్భం దాల్చింది.

ఈ విషయాన్ని స్కూలు యజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళగా.. బయటికి తెలిస్తే పరువు పోతుందని భావించిన ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది. బాలికకు గర్భస్రావాన్ని కలిగించాలనే ఉద్దేశ్యంతో కూల్‌డ్రింక్‌లో మందులు కలిపారు.

మరో కుమార్తె ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు, బాలల సంక్షేమ శాఖ అధికారులతో కలిసి స్కూలు వద్దకు చేరుకున్నారు. బాలికపై అత్యాచారం చేసిన నలుగురు 12వ తరగతి విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్, కేర్ టేకర్, అడ్మినిస్ట్రేటర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi Speech: బెంగాల్ లో బీజేపీ గెలుపుపై మోదీ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
CM Convoy Reaches Vijay’s House: విజయ్ కోసం సీఎం క్యాన్వాయ్ సిద్ధం | Asianet News Telugu