
Andhra Pradesh: ఎకనామిక్ కారిడార్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఓడరేవులను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీతో అనుబంధించబడిన అనంతమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి తమ ప్రభుత్వం ఎలా ప్రయత్నాలు చేస్తున్నదనే విషయాలను ఏపీ ఎకనామిక్ కారిడార్ ప్రారంభం కార్యక్రమంలో ప్రధాని మోడీ వివరించారు.
వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ తెలుగురాష్ట్రాల పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఎకనామిక్ కారిడార్ ప్రారంభం ఆంధ్ర ప్రదేశ్ కోస్టల్ రీజియన్‌ల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ఎనామిక్ కారిడార్‌ను ప్రారంభించడం ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతాల అభివృద్ధికి సహాయపడుతుందని చెప్పారు. 15,233 కోట్ల రూపాయల విలువైన చమురు, గ్యాస్-కనెక్టివిటీ రంగం వంటి ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నంలో శనివారం నాడు శంకుస్థాపన చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి వర్చువల్ మోడ్‌లో మొత్తం తొమ్మిది ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, ఫలకాలను ఆవిష్కరించారు.
ఓడరేవులను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీతో అనుబంధించబడిన అనంతమైన అవకాశాలను ఉపయోగించుకోవడానికి తమ ప్రభుత్వం ఎలా ప్రయత్నాలు చేస్తుందో ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ వివరించారు. "ఈ రోజు, దేశం బ్లూ ఎకానమీతో ముడిపడి ఉన్న అనంతమైన అవకాశాలను గ్రహించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది... పోర్ట్ ఆధారిత అభివృద్ధి ద్వారా భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థలో మేము గొప్ప అవకాశాలను మెరుగుపరిచాము" అని భారీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మోడీ అన్నారు.
అలాగే, "ఈ రోజు ప్రారంభించబడుతున్న ఆర్థిక కారిడార్, ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్యం-తయారీని పెంచడానికి మల్టీమోడల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది... ఈ కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు ఇప్పుడు వేగవంతమైన అభివృద్ధిని పొందుతాయి" అని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయిందని, అయితే సామాన్యుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశం అభివృద్ధి పరంగా కొత్త మైలురాయిని సాధించగలిగినందున భారతదేశం మరింత ముందుకు సాగుతుందని ప్రధాని సూచించారు.
"ఈరోజు ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ, భారతదేశం అనేక రంగాలలో కొత్త మైలురాళ్లను సాధిస్తోంది. అభివృద్ధిలో కొత్త చరిత్రను లిఖిస్తోంది. ప్రపంచం మన అభివృద్ధిని చూస్తోంది. ప్రభుత్వ విధానాలన్నీ సామాన్యుల సంక్షేమమే ప్రధానమైనవి" అని ప్రధాని మోడీ అన్నారు.