చేతి మీది పచ్చబొట్టు చెరిపేస్తేనే, కేంద్రప్రభుత్వ రంగ శాఖల్లో ఉద్యోగం..

By SumaBala BukkaFirst Published Nov 12, 2022, 11:10 AM IST
Highlights

చేతిమీది పచ్చబొట్టు కారణంతో కేంద్ర పోలీసు దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థలో ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించబడ్డాడో యువకుడు. 

ఢిల్లీ : కుడి చేతి వెనక భాగంలో మతపరమైన పచ్చబొట్టు ఉండని కారణంగా కేంద్ర పోలీసు దళాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తదితర బలగాల్లో ప్రవేశానికి ఓ యువకుడిని అనర్హుడిగా ప్రకటించారు. అధికారుల ఈ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు ఆ యువకుడు. సెల్యూట్ చేయడానికి ఉపయోగించే కుడి చేతి మీద మతపరమైన పచ్చబొట్టు ఉండటం కేంద్ర హోం శాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారుల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. 

వైద్య పరీక్షలో తనకు ఎలాంటి లోపాలు లేవని తేలిందని, చేతి మీద పచ్చబొట్టును చిన్నపాటి లేజర్ శస్త్రచికిత్స తొలగించుకుంటానని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. రెండు వారాల్లోపు పచ్చబొట్టు తొలగించుకుని కొత్త వైద్య పరీక్షలకు బోర్డు ముందు హాజరు కావడానికి పిటిషనర్ కు స్వేచ్ఛనిస్తూ హైకోర్టు కేసును ముగించింది.  నియామకానికి అర్హుడని వైద్య వైద్య బోర్డు నిర్ధారిస్తే, చట్టానికి అనుగుణంగా  అతడిని రిక్రూట్ చేసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పింది. 

click me!