మధ్యాహ్నం ఈసి ప్రెస్ మీట్: తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ

By pratap reddyFirst Published Oct 6, 2018, 11:09 AM IST
Highlights

నిజానికి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించాలని ఈసి తొలుత నిర్ణయించింది. అయితే, అది సాయంత్రం 3 గంటలకు వాయిదా పడింది.  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, మిజోరం రాష్ట్రాలకు ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం ఈ రోజు సాయంత్రం 3 గంటలకు జరగనుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ సమావేశంలో వెల్లడిస్తారని భావిస్తున్నారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఈసి వెల్లడిస్తుందా, లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. 

నిజానికి మధ్యాహ్నం 12.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించాలని ఈసి తొలుత నిర్ణయించింది. అయితే, అది సాయంత్రం 3 గంటలకు వాయిదా పడింది.  మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, మిజోరం రాష్ట్రాలకు ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 

ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసి ఈ రోజు ప్రకటిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసి ప్రకటిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. 

ఓటర్ల జాబితా వివాదం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఉంది. దీనివల్ల ఎన్నికల షెడ్యూల్ ను ఈసి ప్రకటిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

click me!