ఓట్ల లెక్కింపు నిలిపివేస్తాం:ఈసీపై మద్రాస్ హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Apr 26, 2021, 3:01 PM IST
Highlights

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  కరోనా వేళ ఎన్నికల ర్యాలీలకు అనుమతివ్వడంపై  అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో కరోనా ఆంక్షలు అమలు చేయడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని మద్రాస్ హైకోర్టు మండిపడింది

చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  కరోనా వేళ ఎన్నికల ర్యాలీలకు అనుమతివ్వడంపై  అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో కరోనా ఆంక్షలు అమలు చేయడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని మద్రాస్ హైకోర్టు మండిపడింది.ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలంటూ చీఫ్ జస్టిస్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఓట్ల లెక్కింపు రోజైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి చర్యలు తీసుకొంటారనే విషయమై  ప్రణాళికలను సమర్పించాలని  ఈసీని ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ నెల 30వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని కోరింది. ఒకవేళ నివేదికను ఇవ్వకపోతే  ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేస్తామని హైకోర్టు హెచ్చరించింది.దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. మరికొన్ని రాష్ట్రాల్లో కొన్ని విడతల పోలింగ్ సాగుతున్న విషయం తెలిసిందే.ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది మే 2వ తేదీన వెలువడనున్నాయి.
 

click me!