మనిషి మాంసం తింటూ నృత్యాలు, వీడియో వైరల్: 10 మందిపై పోలీసుల కేసు

By narsimha lodeFirst Published Jul 27, 2021, 5:00 PM IST
Highlights


తమిళనాడులో మనిషి మాంసం తిన్నారనే నెపంతో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో ఆధారంగా అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 


చెన్నై: తమిళనాడులోని మానవ మాంసం తిన్నారనే నెపంతో 10 మందిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.రాష్ట్రంలోని తెన్‌కాశీ జిల్లాలోని కల్లురాని గ్రామంలోని కట్టుకోవిల్ ఆలయంలో పుర్రెలతో కొందరు నృత్యాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కట్టుకోవిల్ ఆలయంలో కొందరు పుర్రెలతో నృత్యాలు చేశారు.  అయితే ఎవరి శవాన్ని వెలికితీసి  తిన్నారో తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలోని  వీడియో ఆధారంగా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్  ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ  మృతదేహన్ని ఎక్కడి నుండి వెలికితీశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.  సగం కాలిపోయిన మానవ మృతదేహాన్ని  ఏదైనా స్మశాన వాటిక నుండి తీసుకొచ్చారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ ఘటనలో నలుగురు స్వాములతో పాటు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శక్తి మదస్వామి ఆలయంలో  జరిగిన పండుగలో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తి తల తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వారు తింటుంది నిజమైన మానవ తలేనా అనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.2019లో కూడ ఇదే తరహలో మానవ శవాన్ని తిన్నారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో కూడ ఓ వీడియో వెలుగు చూసింది. 

click me!