
న్యూఢిల్లీ : Women Professor ను Sexual harassmentకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. నిందితుడిని Uttar Pradesh లోని ఘాజీపూర్ కు చెందిన ధరంపాల్ రాయ్ గా (36) గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. 36 ఏళ్ల ధరంపాల్ జోధ్పూర్లోని ఆర్ఓ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. అయితే రాయ్ గత కొద్ది రోజులుగా University of Delhiకి చెందిన మహిళా ప్రొఫెసర్ కు అశ్లీల వీడియోలు, అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ వేధిస్తున్నాడు. WhatsApp లో అభ్యంతరకర వీడియోలు పంపిస్తే ఇబ్బంది పెట్టేవాడు.
దీంతో గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ లో Pornographic videos పంపి వేధిస్తున్నాడని మహిళా ప్రొఫెసర్ జనవరి 29న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక సహకారంతో ఢిల్లీ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ కు వీడియో కాల్స్ చేస్తూ వేధిస్తున్నాడు. ఫేస్బుక్ సెర్చ్ లో ప్రొఫెసర్ కాంటాక్ట్ నెంబర్ దొరికిందని, అప్పటి నుంచి ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇతర మహిళలనూ ఇదే తరహాలో నిందితుడు గతంలో ఏమైనా వేధించాడా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.
ఇలాంటి ఘటనే జనవరి 26న కర్ణాటకలో జరిగింది. నగరంలోని బెస్కాం ఆఫీసులో మహిళా సిబ్బందిని తిపటూరు సబ్ టౌన్ రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ గా పనిచేసే బీకే జగదీష్ sexual harrassmentచేస్తున్నట్లు ఏడుగురు women staff ఫిర్యాదు చేశారు. ఓ ఉద్యోగిని మాట్లాడుతూ జగదీశ్ ను తాను ‘అన్న’ అని పిలుస్తానని, అలా పిలవరాదని అసభ్యంగా మాట్లాడడాని తెలిపారు.
డ్యూటీ అయిపోయాక ఫోన్లు చేస్తూ ఇంట్లో ఎవరూ లేకుంటే.. వచ్చేస్తా.. ఓకేనా.. అంటూ వేధిస్తున్నట్లు వాపోయారు. లాడ్జికి రావాలని వేధించినట్లు మరో ఉద్యోగిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమశేఖర్ గౌడ స్పందిస్తూ జగదీశ్ ను మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి కీచక టీచర్ వీడియో కర్ణాటకలో వైరల్ గా మారింది. సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన teachers వక్రమార్గం పడుతున్నారు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన students పాలిట కీచకుల్లా మారి నీచంగా ప్రవర్తిస్తున్నారు. బెదిరించి, భయపెట్టి చిన్నారులను లొంగదీసుకుంటూ.. వారిపై అకృత్యాలకు పాల్పడుతూ school పవిత్రతతను దెబ్బతీస్తున్నారు. అలా పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న head master నీచ ఉదంతం ఒకటి బయటపడింది.
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం Mysore District హెచ్ డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు WhatsAppలో సర్కిల్ కావడంతో ఆ హెచ్ఎం మీద ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరు వ్యాప్తంగా ఆ వీడియోలు viral కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.