
మేఘాలయాలో భూ ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం ఉదయం తురాలో 3.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది. తురాకు ఉత్తరాన 59 కిలోమీటర్ల దూరంలో ఉదయం 6.57 గంటలకు భూమి కంపించిందని పేర్కొంది.
విచిత్రం : ఈయన భార్యతో ఆయన పారిపోయాడు.. ఆయన భార్యను ఈయన పెళ్లిచేసుకున్నాడు..!!
ఈ భూకంపం 29 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు సమాచారం. ‘‘28.02.2023న 06.57.18 గంటలకు 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. లాట్ : 26.04, పొడవు: 90.11. లోతు: 29 కిలో మీటర్లు. ’’ అని సెంటర్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది. కాగా.. ఈ ఈశాన్య ప్రాంతంలో మంగళవారం రోజే నమోదైన రెండో భూకంపం ఇది.
అంతకు ముందు మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల ప్రాంతంలో మణిపూర్‌లోని నోనీ జిల్లాలో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.
‘‘మణిపూర్ లోని నోని జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 02.46 గంటలకు 25 కిలో మీటర్ల లోతులో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 గా నమోదు అయ్యింది.’’ అని ఎన్ సీఎస్ ఓ ట్వీట్ లో పేర్కొంది. కాగా.. మేఘాలయ అసెంబ్లీకి సోమవారం పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో 81 శాతం పోలింగ్ నమోదైంది.
పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం, ఇద్దరు జవాన్లకు గాయాలు.. కొనసాగుతున్న కాల్పులు
భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.