జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రత నమోదు..

Published : Aug 05, 2023, 01:31 PM IST
జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రత నమోదు..

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.2గా నమోదు అయ్యింది. గుల్ మార్గ్  ప్రాంతంలో నేటి ఉదయం 8:36 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి.

జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు వచ్చాయి. గుల్ మార్గ్ లో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.2గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్ సీఎస్ ) తెలిపింది. ఉదయం 8:36 గంటలకు 129 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

మణిపూర్ లో మళ్లీ హింస.. ముగ్గురిని కాల్చి చంపిన దుండగులు..

35.46 అక్షాంశం, 73.32 రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. ‘‘05.08.2023 రోజున భారత కాలమానం ప్రకారం 08.36 గంటల సమయంలో  భూకంపం సంభవించింది. భూకంప లోతు 129 కిలోమీటర్లుగా ఉంది. ’’ అని ఎన్సీఎస్ ట్వీట్ చేసింది. అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం గానీ, వస్తు నష్టం గానీ జరిగినట్లు సమాచారం లేదు.

కాగా.. గురువారం తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా  4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. ఇందులో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ జరగలేదని పేర్కొంది. తెల్లవారుజామున 4.17 గంటలకు భూకంపం సంభవించిందనీ, భూకంప కేంద్రం 61 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృత‌మై ఉంద‌ని తెలిపింది.

ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి.. కాశ్మీర్ లోని కుల్గాంలో ఘటన..

అంతకు ఒక రోజు ముందు బుధవారం తెల్లవారు జామున 5.40 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.0గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. జులై 29న అర్ధరాత్రి 12.53 గంటలకు ఇదే  అండమాన్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదు అయ్యింది. ఈ భూకంపం 69 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu