కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం: కీలకాంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Jun 16, 2021, 11:16 AM IST
Highlights

కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరగనుంది. వ్యాక్సినేషన్ తో పాటు  ఇతర కీలక అంశాలపై  కేబినెట్ చర్చించనుంది. 

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరగనుంది. వ్యాక్సినేషన్ తో పాటు  ఇతర కీలక అంశాలపై  కేబినెట్ చర్చించనుంది. కరోనా వ్యాక్సిన్ పై  కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కీలక నిర్ణయం తీసుకొంది. దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. 

&n

కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం నాడు జరగనుంది. వ్యాక్సినేషన్ తో పాటు ఇతర కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. కరోనా వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కీలక నిర్ణయం తీసుకొంది. దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. pic.twitter.com/bMud38TgVD

— Asianetnews Telugu (@AsianetNewsTL)

bsp;

 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ అంశంతో పాటు కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడ చర్చించనున్నారు.  అంతేకాదు కరోనాతో దెబ్బతిన్న రంగాలకు ఉద్దీపన ప్యాకేజీ వంటి అంశాలపై కూడ కేంద్ర కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. 

కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. కేంద్ర కేబినెట్ లో ఖాళీగా  ఉన్న పోస్టులను కూడ భర్తీ చేయనుంది.  ఈ మేరకు మోడీ మంత్రులతో ఇటీవల కాలంలో వరుసగా సమావేశమయ్యారు.  ఎంపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆయన తెలుసుకొంటున్నారు. 

click me!