స్టాలిన్ జోరుకి బ్రేక్ ... దూసుకుపోతున్న అన్నాడీఎంకే

By telugu teamFirst Published Oct 24, 2019, 12:34 PM IST
Highlights

ఇప్పటి వరకు జరిగిన రౌంట్ల ప్రకారం  అధికార పార్టీ  అన్నాడీఎంకే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ రోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా... మొదటి నుంచీ అన్నాడీఎంకేనే ముందంజలో ఉండటం విశేషం.

తమిళనాడు రాష్ట్రంలో మంచి  జోరుమీదున్న డీఎంకే అధినేత స్టాలిన్ కి బ్రేకులు పడ్డాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేను గట్టి దెబ్బ కొట్టిన స్టాలిన్ కి ఉప ఎన్నికల్లో ఊహించని షాక్ తగలింది. ఈ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే దూసుకుపోతుండటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.... తమిళనాడు రాష్ట్రంలోని నంగునేరి, విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరిగాయి. అయితే... ఈ  రెండు స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన రౌంట్ల ప్రకారం  అధికార పార్టీ  అన్నాడీఎంకే ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ రోజు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా... మొదటి నుంచీ అన్నాడీఎంకేనే ముందంజలో ఉండటం విశేషం.

read more :Haryana Election Results 2019: హంగ్ దిశగా హర్యానా, బేరసారాలు షురూ

ఇప్పటి లెక్కల్ని బట్టి చూస్తే రెండు స్థానాల్లో అన్నాడీఎంకే గెలవడం ఖామయని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో 22 స్థానాలు డీఎంకే గెలుచుకుంది. కాగా ఉప ఎన్నికల్లో కూడా డీఎంకే గెలుస్తుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అలానే వచ్చాయి. అయితే... వాటికి భిన్నంగా ప్రజల తీర్పు ఉండటం విశేషం.

డీఎంకే గెలుస్తుందని చాలా వరకు రాజకీయ జోస్యాలు వెలువడ్డాయి. అయితే వాటన్నిటినీ తోసి రాజని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేయనుంది. అనేక రాజకీయ డ్రామాల తర్వాత పట్టు నిలుపుకున్నప్పటికీ వరుసగా ఎదురు దెబ్బలతో కొట్టు మిట్టాడుతూ వస్తున్న అన్నాడీఎంకేకు ఈ ఉప ఎన్నిక జీవం పోసింది. మరి 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ గెలుస్తారా.. ఓపీస్-ఈపీఎస్ (పన్నీర్ సెల్వం-పళనిస్వామి) నిలుస్తారా అనేది వేచి చూడాలి.
 

click me!