ఫోటోకు యత్నించిన ఇద్దరిని వెంటాడిన ఏనుగు: ప్రాణభయంతో పరుగులు (వీడియో)

Published : Feb 02, 2024, 09:38 AM ISTUpdated : Feb 02, 2024, 10:46 AM IST
ఫోటోకు యత్నించిన ఇద్దరిని వెంటాడిన ఏనుగు: ప్రాణభయంతో  పరుగులు (వీడియో)

సారాంశం

కేరళ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దు  ఫారెస్ట్ ఏరియాలో  ఏనుగు దాడి నుండి  ఇద్దరు వ్యక్తులు ప్రాణపాయం నుండి తప్పించుకున్నారు.

న్యూఢిల్లీ:  కేరళ -కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని  వాయనాడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో  ఏనుగు దాడి నుండి  ఇద్దరు వ్యక్తులు  సురక్షితంగా బయటపడ్డాడు. ఇద్దరు వ్యక్తులను ఏనుగు తరుముతున్న వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే  ఏనుగు నుండి తప్పించుకొనే క్రమంలో ఓ వ్యక్తి  రోడ్డుపై పడిపోయాడు.ఏనుగు దాడి నుండి ఆ వ్యక్తి తప్పించుకున్నాడు.  దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 

వాయనాడ్-మైసూర్  అటవీ రహదారిపై ఉన్న బందీపూర్ నేషనల్ పార్క్ స్ట్రెచ్ లో  ఈ ఘటన చోటు చేసుకుంది.  తాళ్లప్పుజాకు చెందిన సవాద్  అనే వ్యక్తి  ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పర్యాటకులు  కర్ణాటక నుండి బందీపూర్ నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా  కేరళకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో   అటుగా వెళ్తున్న ఏనుగు ఫోటో తీయడానికి కారులో వెళ్తున్న ఇద్దరు ప్రయత్నించారు.  ఇందు కోసం రోడ్డుపైనే కారును నిలిపివేశారు.  ఈ విషయాన్ని గమనించిన  ఏనుగు ఈ ఇద్దరిని వెంటాడింది. ఏనుగు ఫోటో తీయడానికి ప్రయత్నించిన వ్యక్తులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. కారులో ఉన్న వారు వెంటనే కారును స్టార్ట్ చేసి ముందుకు నడిపించారు.  ఏనుగు వెంబడించడంతో  ఓ వ్యక్తి  రోడ్డుపై కిందపడిపోయాడు. అయితే ఆ వ్యక్తిపై ఏనుగు దాడికి ప్రయత్నించింది. అయితే అతను  తృటిలో ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.

also read:కావడిలో అయోధ్యకు: పేరేంట్స్ ను మోసుకెళ్తున్న కొడుకు

ఈ రోడ్డు మార్గంలో  వెళ్తున్న సమయంలో  వాహనాలు ఆపడం లేదా  వాహనాల తలుపులు  తెరవడంపై  ఆంక్షలున్నాయి.  రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో వన్యమృగాలు  ఈ ప్రాంతంలో  సంచరిస్తుంటాయి. ఈ కారణంగానే  ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని  అధికారులు సూచిస్తున్నారు.
అయితే  అధికారుల సూచనలను చాలా మంది పెడచెవిన పెడుతున్నారు.ఈ కారణంగానే  ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.వన్యప్రాణుల దాడులకు గురికావడమో, లేదా అటవీ జంతువులకు  ఇబ్బంది కల్గిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu