
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) కాంగ్రెస్(Congress) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి చురకలు అంటించారు. 2014లో జరిగిన ఓ ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీని యువరాజు అని పేర్కొన్నారు. 2014లో తనను ప్రధాన మంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన తర్వాత ఆ ఘటన జరిగిందని, అప్పుడు తాను పంజాబ్(Punjab Assembly Elections)లో క్యాంపెయినింగ్ కోసం వచ్చామని వివరించారు.
ప్రధాన మంత్రి అభ్యర్థిగా నా పేరును ప్రకటించారు. నేను పఠాన్‌కోట్, హిమచల్ ప్రదేశ్‌లో ప్రచారం చేయాల్సి ఉన్నది. కానీ, అప్పుడు నా చాపర్‌ను ఎగరనివ్వలదు. ఎందుకంటే.. అప్పుడు అమృత్‌సర్‌లో యువరాజు ఉన్నారు. ప్రిన్స్ ఉన్నారు కాబట్టే.. నా చాపర్ ఎగరడానికి వారు అనుమతులు ఇవ్వలేదు. ప్రత్యర్థులు సజావుగా తమ పని చేసుకోవడాన్ని కాంగ్రెస్ ఆమోదించదని ఆరోపించారు. ఆదివారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన జలంధర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.
అయితే, పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ చాపర్ ఎగరడానికి ఈ రోజు అనుమతులు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధాన మంత్రి పర్యటన వల్ల నో ఫ్లై జోన్ ఉన్నదని, ఈ కారణంగా చండీగడ్‌లోని రాజేంద్ర పార్క్ నుంచి సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ చాపర్ ఎగరడానికి అనుమతులు రాలేవు. ఈ రోజు రాహుల్ గాంధీ హోషియార్‌పుర్‌లో ప్రచారానికి వచ్చారు. ఈ ప్రచార కార్యక్రమానికి సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ హోషియార్‌పుర్ వెళ్లాల్సి ఉన్నది. కానీ, ఆయన చాపర్‌ను ఎగరనివ్వలేదు. కాగా, హోషియార్‌పుర్‌లో రాహుల్ గాంధీ చాపర్ ఎగరడానికి అనుమతించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ పై కౌంటర్ వేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం చేస్తూ ప్రియాంక గాంధీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై విమర్శలు సంధించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు పంజాబ్ ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీ చెప్పుచేతల్లో నడిచిందని ఆరోపించారు. తాజాగా, ఈ ఆరోపణలకు ప్రధాని మోడీ ప్రతిజవాబు ఇచ్చారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వ నిర్వహణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆటంకాలు సృష్టించిందని అన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌నూ అవమానించిందని పేర్కొన్నారు. ఒక రిమోట్ కంట్రోల్ విధానంలో పంజాబ్ ప్రభుత్వాన్ని నడిపిందని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు పంజాబ్‌లో పర్యటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో మాట్లాడారు. జలంధర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీకి భద్రతా వైఫల్యం ఎదురైన తర్వాత తొలిసారిగా ఆయన మళ్లీ పంజాబ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జలంధర్‌లో మాట్లాడుతూ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నడిపిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వాన్ని నడపడం వారికి ఇష్టం లేదని పేర్కొన్నట్టు గుర్తు చేశారు. అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒకే ఒక కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్‌గా పని చేస్తున్నాయని తేటతెల్లం అయింది కదా అని ఆరోపించారు.