Air India CEOగా ఇల్క‌ర్ ఐచీ ఎంపిక‌

Published : Feb 14, 2022, 06:06 PM IST
Air India CEOగా ఇల్క‌ర్ ఐచీ ఎంపిక‌

సారాంశం

Air India CEO: ఎయిర్ ఇండియాకు నూత‌న  సీఈవో, ఎండీగా ఇల్క‌ర్ ఐచీ( Ilker Ayci) ని Tata Sons నియమించింది.  ఆయ‌న‌ గ‌తంలో ట‌ర్కి ఎయిర్‌లైన్స్‌కు మాజీ చైర్మెన్‌గా ప‌నిచేశారు. ఎయిర్ ఇండియా బోర్డు స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన సుదీర్ఘ చ‌ర్చ‌ల త‌ర్వాత ఇల్క‌ర్ నియామ‌కాన్ని ద్రువీక‌రించారు.   

Air India CEO: ఎయిర్ ఇండియాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా ఇల్క‌ర్ ఐచీ( Ilker Ayci) ని Tata Sons నియమించింది . ఇల్క‌ర్ ఐచీ..  ఏప్రిల్ 1, 2022 లేదా అంతకు ముందు తన బాధ్యతలను స్వీకరిస్తారని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. 
ఎయిర్ ఇండియాకు CEO ను ఎన్నుకోవ‌డం కోసం ఎయిర్ ఇండియా బోర్డు సోమవారం మధ్యాహ్నం సమావేశమైంది.బోర్డు సమావేశానికి టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు.

బోర్డు స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన సుదీర్ఘ చ‌ర్చ‌ల త‌ర్వాత ఇల్క‌ర్ నియామకానికి ఆమోదం తెలిపిందని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.   టర్కిష్ ఎయిర్‌లైన్స్‌ను లాభాల బాట‌లో ప్ర‌యాణించ‌డానికి ఇల్కర్ కృషి చేశారు. ఏవియేషన్ ఇండస్ట్రీ లీడర్ అయిన ఇల్కర్‌ను టాటా గ్రూప్‌కి స్వాగతిస్తుండ‌టం చాలా సంతోషంగా ఉంద‌ని, ఆయ‌న‌ ఎయిర్ ఇండియాను న‌వ శ‌కంలో న‌డిపిస్తాడ‌ని టాటా సన్స్ ఆశ‌భావం వ్య‌క్తం చేసింది. 

ఇల్క‌ర్ ఐచీ వ‌య‌సు 51 ఏళ్లు. బిల్‌కెంట్ యూనివ‌ర్సిటీలో ఆయ‌న పొలిటిక‌ల్ సైన్స్ అండ్ ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ చ‌దివారు. 1995లో బ్రిట‌న్‌లోని లీడ్స్ వ‌ర్సిటీలోనూ రాజ‌నీతి శాస్త్రంపై ప‌రిశోధ‌న చేశారు. ఇస్తాంబుల్‌లోని మ‌ర్మ‌రా వ‌ర్సిటీలో ఇంట‌ర్నేష‌న‌ల్ రిలేష‌న్స్‌లో మాస్ట‌ర్స్ ప్రోగ్రామ్ చేశారు. ట‌ర్కిష్ ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ బోర్డులో స‌భ్యుడిగా ఉన్నారు. గ‌తంలో Ilker Ayci టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు ఛైర్మన్‌గా ప‌నిచేశారు. అతను అంతకు ముందు కంపెనీ బోర్డులో ఉన్నారు.

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ 68 ఏళ్ల తరువాత మళ్లీ టాటా సన్స్ చేతుల్లోకి వ‌చ్చింది. బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎయిర్ ఇండియాను రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి టాటా సన్స్ సొంతం చేసుకుంది.టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2,700 కోట్లను ప్రభుత్వం స్వీకరించడం.. 15,300 రుణాన్ని నిలుపుకోవడంతో Air India (100% ఎయిర్ ఇండియా షేర్లు .. దాని అనుబంధ సంస్థ AIXL , Air India Assets Holding Ltd. (AIAHL) యొక్క 50% షేర్లు) వాటాలు  టాటా గ్రూప్ కు బదిలీ చేయబడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu