దుబాయి మామకు కేరళ అల్లుడు టోకరా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 107 కోట్లు స్వాహా.. 

By Rajesh KarampooriFirst Published Nov 25, 2022, 5:32 PM IST
Highlights

కేరళ మోసం కేసు: దుబాయ్‌కి చెందిన ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త అబ్దుల్ లాహిర్ హసన్‌ను కేరళలోని కాసర్‌గోడ్‌లో నివసించే అతని సొంత అల్లుడు దోచుకున్నాడు. తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చిన 1,000 సవరీల బంగారు ఆభరణాలు కాకుండా, తన అల్లుడు రూ. 107 కోట్లను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

నమ్మి వ్యాపార వ్యవహారాలను అప్పగిస్తే.. పిల్లనిచ్చిన మామకు స్వంత అల్లుడు మోసం చేశారు. ఒకటి కాదు. రెండు కాదు.. ఏకంగా వంద కోట్ల రూపాయాలకు ఏగనామం పెట్టాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ప్రవాస భారతీయుడు, వ్యాపారవేత్త, దుబాయ్‌ నివాసి అబ్దుల్ లాహిర్ హసన్.. భారత్ లో ఉన్న తన వ్యాపార లావాదేవీలను చూసుకోమని కేరళలోని కాసర్గోడ్ నివాసి ముహమ్మద్ హఫీజ్‌కు అప్పజేప్పాడు. అతడు తన అల్లుడు. అతడి తన స్వంత కూతురిని ఇచ్చి.. ఘనంగా పెళ్లి చేశాడు.

స్వంత అల్లుడు కాదా.. అనే నమ్మకంతో ఎలాంటి సందేహం లేకుండా ఉన్నాడు. కానీ.. నమ్మిన వాడు నమ్మక ద్రోహం చేశాడని కలలో కూడా ఊహించలేదు. ఇటీవల భారత్ లోని వ్యాపార దావాదేవీలను పరిశీలించగా.. ఏకంగా రూ.107 కోట్లు మోసం చేశాడని తెలుసుకుని కంగుతిన్నాడు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు.. డబ్బులను దోచుకుని దేశ విడిచి పారిపోయక  తన అల్లుడు ముహమ్మద్ హఫీజ్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ఫిర్యాదు ప్రకారం..  ముహమ్మద్ హఫీజ్ తన కొన్ని ఆస్తుల యాజమాన్య హక్కులను మోసపూరితంగా సంపాదించాడని ఆరోపించాడు. 2017లో అబ్దుల్ లాహిర్ తన కుమార్తెను కేరళలోని కాసర్గోడ్ నివాసి ముహమ్మద్ హఫీజ్‌కు ఇచ్చి.. వివాహం చేశాడు. ఏ ఒక రోజు కూడా తన అల్లుడు తనకు నమ్మక ద్రోహం చేస్తాడని కలలో కూడా  ఆలోచన రాలేదని అంటున్నాడు. మరోవైపు, పోలీసులు ఈ కేసు దర్యాప్తును (నవంబర్ 24) గురువారం కేరళ పోలీసుల క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.

ఈడీ రైడ్ తర్వాత.. వెలుగులోకి వచ్చిన మోసం  

తన వ్యాపార సంస్థలపై ఈడీ దాడుల చేయడంతో తన అల్లుడు తనని మోసం చేశాడని తెలిసిందని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. ఈడీ దాడులు నిర్వహించి అతడికి రూ.4 కోట్ల జరిమానా విధించింది. జరిమానా కట్టేందుకు ముహమ్మద్ హఫీజ్‌ భార్య తన తండ్రిని డబ్బులు అడిగింది. ఆ తర్వాత భూమి కొనుక్కోవడం, ఫుట్‌వేర్ షోరూం తెరవడం వంటి పలు సాకులతో అల్లుడు అతడి నుంచి రూ.92 కోట్లు రాబట్టాడు.  అలువా పోలీసులు నిందితుడిని విచారణకు పిలవడమే కాకుండా అరెస్టు కూడా చేయలేదని ఫిర్యాదుదారు ఆరోపించారు. అదే సమయంలో ఈ కేసులో అతని సహచరులలో ఒకరైన అక్షయ్ థామస్ కూడా హసన్ అల్లుడితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అతడిపై విచారణ కూడా జరుగుతోంది.


ఫిర్యాదుదారుడు మీడియాతో మాట్లాడుతూ.. అలువా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంలో లేదా అతనిని విచారణకు పిలవడంలో విఫలమయ్యారని, అతని ఉపయోగం కోసం ఇచ్చిన రూ. 1.5 కోట్ల విలువైన కారును కూడా వారు స్వాధీనం చేసుకోలేకపోయారని ఫిర్యాదు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్ తర్వాత తనపై విధించిన జరిమానాను చెల్లించడానికి తన అల్లుడు సుమారు రూ. 4 కోట్లు డిమాండ్ చేయడంతో మోసం జరిగినట్టు గుర్తించానని తెలిపారు. ఆ తర్వాత తన అల్లుడు తన బిడ్డను అడ్డ పెట్టుకుని..  భూమి కొనుగోలు లేదా ఫుట్‌వేర్ షోరూం తెరిపిస్తానని చెప్పి రూ.92 కోట్లకు పైగా మోసం చేశాడని సదరు వ్యాపారి తెలిపారు. ఇదంతా  తన అల్లుడు ఒక్కడే చేయలేదని, అక్షయ్ థామస్ వైద్యన్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. వీరిద్దరి పేర్లను హసన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

click me!