తప్పతాగి వేధిస్తున్న భార్య నుండి కాపాడండి మహాప్రభో: ఓ బాధితుడి ఆవేధన

Arun Kumar P   | Asianet News
Published : Sep 20, 2020, 08:17 AM ISTUpdated : Sep 20, 2020, 08:28 AM IST
తప్పతాగి వేధిస్తున్న భార్య నుండి కాపాడండి మహాప్రభో: ఓ బాధితుడి ఆవేధన

సారాంశం

విచిత్రంగా తప్పతాగి వేధిస్తున్న భార్య నుండి తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించాడో భర్త.

అహ్మదాబాద్: మద్యం మత్తులో భర్తలు భార్యలను కొట్టడం... వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనేక సంఘటలను మనం నిత్యం చూస్తుంటాం. కానీ విచిత్రంగా తప్పతాగి వేధిస్తున్న భార్య నుండి తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించాడో భర్త. ఈ సంఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.

అహ్మదాబాద్ లోని మునినగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహమయ్యింది. అయితే పెళ్లయిన తర్వాత భార్య పెద్ద తాగుబోతని అతడికి తెలిసింది. అయితే ఆమె కేవలం మద్యం సేవించడమే కాదు నిత్యం భర్తతో పాటు అత్తామామలను చితకబాదేది. ఇంతటిలో ఆగకుండా భర్త పరిచేసే ఆఫీసు వద్దకు వెళ్ళి కూడా నానా రభస చేసేది. 

read more  మేనల్లుడిని చితకబాది మహిళపై గ్యాంగ్ రేప్: ఆన్ లైన్లో వీడియో పోస్టు

రెండేళ్లుగా ఆమె వేధింపులను భరిస్తూ వస్తున్నాడు సదరు భర్త. అయితే ఇటీవల ఆమె వేధింపులు మరీ ఎక్కువ అవడంతో పోలీసులను ఆశ్రయించాడు. తాగుబోతు భార్యనుండి తనను కాపాడాలంటూ పోలీసులకు వేడుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu