జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆరుగురు కిరాతకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో గల టీజారా పోలీసు స్టే,న్ పరిధిలో 45 ేళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. 

సామూహిక అత్యాచారం చేసిన ఘటనను దుండగులు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. ఓ వివాహత తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తికి డబ్బులు ఇవ్వడానికి వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండడా ఓ కొండపై ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. 

మహిళ మేనల్లుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ తర్వాత మహిళపై వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మహిళ తన భర్తకు చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.