కర్ణాటకలో దారుణం... సాంబారు రుచిగాలేదని తల్లీ చెల్లిన కాల్చిచంపిన తాగుబోతు

Arun Kumar P   | Asianet News
Published : Oct 15, 2021, 09:24 AM ISTUpdated : Oct 15, 2021, 09:32 AM IST
కర్ణాటకలో దారుణం... సాంబారు రుచిగాలేదని తల్లీ చెల్లిన కాల్చిచంపిన తాగుబోతు

సారాంశం

తాగిన మత్తులో విచక్షణను కోల్పోయిన ఓ తాగుబోతు కన్న తల్లి, తోబుట్టువును అతి కిరాతకంగా కాల్చిచంపాడు. ఈ దారుణం కర్ణాటకలో చోటుచేసుకుంది. 

సిద్దాపుర: తాగినమత్తులో అతడు విచక్షణను కోల్పోయాడు. కేవలం సాంబారు రుచిగా చేయలేదని కోపంతో ఊగిపోయి కన్న తల్లిని, తోబుట్టువుపై కాల్పులకు దిగాడు. తుపాకీతో కాల్చడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.  ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... Karnataka లోని సిద్దాపుర తాలుకా కుడగోడు గ్రామానికి చెందిన మంజునాథ్ పెద్ద తాగుబోతు. ఎప్పుడూ మద్యం మత్తులోనే వుంటూ కుటుంబసభ్యులతో గొడవపడుతుండేవాడు. ఇలా నిన్న(గురువారం) కూడా పీకలదాక మందు తాగి తూలుతూ ఇంటింకి చేరుకున్నాడు. అదే మత్తులో బోజనం చేస్తూ సాంబారు రుచిగా లేదంటూ తల్లి పార్వతి(42), సోదరి రమ్య(19)తో గొడవకు దిగాడు.  

read more  నగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్... జాతీయపార్టీ మహిళా నాయకురాలి అరెస్ట్

ఈ క్రమంలోనే తల్లి, సోదరిపై ఆగ్రహంతో ఊగిపోతూ విచక్షణను కోల్పోయిన మంజునాథ్ దారుణానికి ఒడిగట్టాడు. తన వద్దనున్న నాటు తుపాకీతో తల్లి, సోదరిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరి శరీరంలోని బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించారు. 

తుపాకీ కాల్పుల శబ్దం విని చుట్టపక్కల ఇళ్ళవారు వచ్చి చూసేసరికి పార్వతి, రమ్య మృతదేహాలు రక్తపు మడుగులో పడివున్నాయి. మంజునాథ్ చేతిలో తుపాకిని గమనించిన వారు భయంతో బయటకు పరుగుతీసారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. తల్లీ కూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంజునాథ్ ను అరెస్ట్ చేయడమే కాదు కాల్పులకు తెగబడ్డ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్