Asianet News TeluguAsianet News Telugu

నగ్న ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్... జాతీయపార్టీ మహిళా నాయకురాలి అరెస్ట్

పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులను, బడా కాంట్రాక్టర్లను హనీ ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ జాతీయ పార్టీ మహిళా నాయకురాలిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసారు.

national party Women leader Arrested in Honey Trap Case in Karnataka
Author
Bangalore, First Published Oct 15, 2021, 8:41 AM IST

బెంగళూరు: ఓ జాతీయ పార్టీలో రాష్ట్రస్థాయి నాయకురాలు. మంచి హోదాలో వున్న ఆమె నీచానికి పాల్పడింది. వివిధ పార్టీల నాయకులకు వలపు వల విసిరే దగ్గరై ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలుచేసేది. ఇలా తాజాగా ఓ కాంట్రాక్టర్ తో కూడా ఇలాగే దగ్గరై డబ్బులు డిమాండ్ చేయడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సదరు మహిళా నేత అసలురంగు బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... కర్ణాటక కొప్పళ్ ప్రాంతానికి చెందిన ఓ జాతీయపార్టీ నాయకురాలు రాజధాని బెంగళూరులో నివాసముంటోంది. ప్రస్తుతం ఆమె సదరు జాతీయపార్టీ తమిళనాడు మహిళా విభాగం ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉన్నత బాధ్యతల్లో వున్న మహిళా నేత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కింది. రాజకీయంగా, ఆర్థికంగా మంచి  స్థానంలో వున్న వారిని టార్గెట్ గా చేసుకుని honey trap చేసేది. ఆ తర్వాత వారిని blackmail చేసి భారీగా డబ్బులు వసూలు చేసేది.   

read more  బాత్‌రూమ్‌లో బంధించి యువతిపై గ్యాంగ్ రేప్: ఒకరి అరెస్ట్, మరొకరి కోసం గాలింపు

మొదట టార్గెట్ ను ఎంచుకున్న తర్వాత అతడితో పరిచయం పెంచుకుని దగ్గరయ్యేది ఈ మహిళా నాయకురాలు. ఆ తర్వాత అతడితో ఏకాంతంగా గడుపుతూ సీక్రెట్ గా ఫోటోలు, వీడియోలు తీసేది. ఆ తర్వాత తనతో కలిసున్నnude photos, అసభ్యకర వీడియోలు బయటపెడతానంంటూ బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేసేది. దీంతో తన రాసలీలల ఫోటోలు, వీడియోలు బయటకు వస్తే పరువు పోవడమే కాదు రాజకీయంగా కూడా దెబ్బతింటామని భావించి ఆమె అడిగినంత ఇచ్చేసేవారు. ఇలా ఇప్పటికే చాలామందిన ఈ మహిళా నాయకురాలు బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే తాజాగా ఓ కాంట్రాక్టర్ ను కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేయడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మహిళా నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా హనీ ట్రాప్ గురించి బయటపడింది. అయితే కేసు విచారణ దశలో వుండటంతో వివరాలను వెల్లడించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios