లేడీస్ హాస్టళ్లో విద్యార్థినులతో సెక్యూరిటీ గార్డ్ వికృతచేష్టలు.. తాగినమత్తులో హల్ చల్...

Published : Aug 17, 2022, 03:31 PM IST
లేడీస్ హాస్టళ్లో విద్యార్థినులతో సెక్యూరిటీ గార్డ్ వికృతచేష్టలు.. తాగినమత్తులో హల్ చల్...

సారాంశం

ఢిల్లీలో ఓ లేడీస్ హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న వ్యక్తి తప్పతాగి.. హాస్టల్ లోని యువతుల మీద అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడి మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.

ఢిల్లీ :  Delhiలో మరో షాకింగ్ ఘటన సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయింది. ఫుటేజీని చెక్ చేస్తున్నప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తాగిన మత్తులో ladies hostelలో జొరబడి ఓ యువతిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు అదే హాస్టల్ కు చెందిన Security guard. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కాగా బయటకు విషయం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే… ఢిల్లీ karol bagh ఏరియాలో ఉన్న ఓ లేడీస్ హాస్టల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ కారిడార్ లోంచి వెళుతున్న యువతులు.. మద్యం మత్తులో లోపలికి వచ్చిన సెక్యూరిటీ గార్డును చూసి ఒక్కసారిగా  వెనక్కి పరుగులు తీశారు. ఇంతలో ఓ యువతిని దొరకబుచ్చుకుని, అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడ్డాడు సెక్యూరిటీ గార్డు.

ఈ ఘటనపై హాస్టల్ ఓనర్ ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ స్వాతి దృష్టికి చేరడంతో ఆమె ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.  దీంతో డిసిడబ్ల్యు రంగంలోకి దిగి.. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వారు వెంటనే దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేయాలని Swati maliwal,  ఢిల్లీ పోలీసులను  కోరారు. అంతేకాదు గురువారం సాయంత్రం కల్లా ఘటనపై పూర్తి నివేదికను అందించాలని గడువు విధించారు.

జమ్మూలో షాకింగ్ ఘ‌ట‌న‌.. రెండు ఇళ్లలో 6 మృతదేహాలు ల‌భ్యం.. ద‌ర్యాప్తున‌కు సిట్ ఏర్పాటు

అయితే,బాధితురాలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో న్యాయ సలహా మేరకు వీడియో ఆధారంతో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ డీసీపీ శ్వేతా చౌహన్ వెల్లడించారు.వీడియో చూస్తే అమ్మాయిల భద్రత మీద తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగించేలా ఉంది.
 

 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu