మద్యం మత్తులో తాగుబోతుల హంగామా.. బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని గందరగోళం.. వీడియో వైరల్..

Published : Sep 05, 2023, 06:53 AM ISTUpdated : Sep 05, 2023, 06:59 AM IST
మద్యం మత్తులో తాగుబోతుల హంగామా.. బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని గందరగోళం.. వీడియో వైరల్..

సారాంశం

నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఇద్దరు వ్యక్తులు పుల్ గా తాగి నానా బీభత్సం చేశారు. ఓ అపార్ట్ బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని, అక్కడ నుంచి దూకుతున్నట్టు, అరుసూ, కేకలు వేస్తూ నానా హంగామా క్రియేట్ చేశారు. ఈ సంఘటన నోయిడాలోని సూపర్‌టెక్ ఎకో విలేజ్-3 హౌసింగ్ సొసైటీలో ఆదివారం చోటుచేసుకుంది

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు నానా హంగామా సృష్టించారు. పీకలదాకా పుల్ గా తాగిన ఇద్దరు వ్యక్తులు ఓ అపార్ట్ మెంట్ లోని  5వ అంతస్తు  బాల్కనీ స్లాబ్‌పై ప్రమాదకరరీతితో కూర్చొన్నారు. అక్కడ నుంచి దూకుతున్నట్టు, అరుసూ, కేకలు వేస్తూ నానా హంగామా క్రియేట్ చేశారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని సూపర్‌టెక్ ఎకో విలేజ్-3 హౌసింగ్ సొసైటీలో ఆదివారం (సెప్టెంబర్ 3) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ  క్లిప్‌లో ఇద్దరు వ్యక్తులు బాల్కనీ స్లాబ్‌పై కూర్చొని అరుస్తూ తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత.. వారిని అరుపులు, కేకలు విన్న నివాసితులు జోక్యం చేసుకుని, వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మద్యం మత్తులో పురుషులు వారిపై దుర్భాషలాడడంతో తొలుత విఫలమయ్యారు. కానీ.. కొన్ని విఫల ప్రయత్నాల తర్వాత.. నివాసితులు వారిని రక్షించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండటంతో ఆ వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తుంది. "ఇది స్టంట్ లేదా ఆత్మహత్యాయత్నమా? ఇలాంటి చర్యలు సోసైటీలో నివసించే కుటుంబాలు, పిల్లలకు ఇటువంటి వాతావరణం ఆరోగ్యకరమైనది కాదు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.  

ఈ బ్యాచిలర్‌లు ఇలాంటి స్టంట్‌ చేయడం ఇదే ఒక్కసారే కాదని, గతంలో కూడా వారు తప్పుగా ప్రవర్తించారని నివాసి వెల్లడించారు. దీంతో సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు. వైరల్ వీడియోలోని వ్యక్తుల కోసం వెతుకుతున్నారు.

ఇంతకుముందు.. నోయిడా హౌసింగ్ సొసైటీలో ఓ ఫైటింగ్ వీడియో వైరల్ కావడంతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీలో గత నెలలో ఈ ఘటన జరిగింది. హైరైజ్‌లో పార్కింగ్‌పై వివాదం తలెత్తడంతో గొడవ మొదలైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, కొంతమంది నివాసితులు పోలీసులపై కూడా దాడి చేశారు, ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోను పలువురు జర్నలిస్టులు, స్థానిక సంస్థలు పోస్ట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు