కేంద్రమంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. మద్యం మత్తులో కారును ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్

By Rajesh Karampoori  |  First Published Mar 17, 2023, 4:11 AM IST

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి కారుకు ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రితోపాటు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 


కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న టయోటా ఇన్నోవాను డుతో కూడిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపురలో జాతీయ రహదారి-50పై గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రి, ఆయన డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా ప్రథమ చికిత్స అందించారు. ట్రక్కు డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని, అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో ట్రక్కు బోల్తా పడి కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

మహిళా సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి

Latest Videos

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్వహిస్తున్న 'మహిళా సదస్సు'లో ఆమె పాల్గొనేందుకు వెళ్తుంది. ఈ ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. జ్యోతి విలేకరులతో మాట్లాడుతూ.. 'దేవుని దయతో నేను క్షేమంగా ఉన్నాను. డ్రైవర్ అప్రమత్తత వల్ల ట్రక్కు కిందకు వెళ్లకుండా కాపాడారు. మాకు స్వల్ప గాయాలయ్యాయి, అంతా బాగానే ఉందని వైద్యులు తెలిపారని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

click me!