పట్టపగలు దోపిడీ.. మహిళ ప్రొఫెసర్ తలపై కొట్టి.. రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

By Rajesh KarampooriFirst Published Mar 17, 2023, 1:21 AM IST
Highlights

తమిళనాడులోని తిరుచ్చిలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఓ మహిళా ప్రొఫెసర్‌పై దాడి చేసి.. ఆమెను కొద్ది దూరం ఈడ్చుకెళ్లి విడిచిపెట్టాడు. అనంతరం దోపిడీకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటపడగా.. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

తమిళనాడులోని తిరుచ్చిలో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. ఓ మహిళా ప్రొఫెసర్‌పై విచక్షణ రహితంగా దాడి చేసి.. దోపిడీకి పాల్పడ్డారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఓ దుర్మార్గుడు చెక్క పలకతో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె నేలపై పడి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తరువాత ఆ దుండగుడు.. మహిళను కొద్ది దూరం ఈడ్చుకెళ్లి విడిచిపెట్టి..ఆమె మొబైల్, డబ్బు, స్కూటర్ కీ లాక్కొని పరారయ్యారు. మహిళ స్పృహలోకి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం తిరుచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుంది.  
  
వివరాలు ఇలా ఉన్నాయి.. బాధిత మహిళ పేరు సీతాలక్ష్మి . ఆమె అన్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆదివారం యూనివర్సిటీ సమీపంలో సీతాలక్ష్మి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సెంథిల్ కుమార్ అనే దుండగుడు చెక్క పలకతో ఆమె తలపై కొట్టాడు. అనంతరం సెంథిల్ సీతాలక్ష్మిని రోడ్డుపై నుంచి ఫుట్‌పాత్‌పైకి ఈడ్చుకెళ్లి ద్విచక్ర వాహనం తాళాలు తీసుకుని ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్ దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఘటన తర్వాత మహిళ స్పృహతప్పి పడిపోయింది. స్పృహలోకి రాగానే పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను విచారించారు. అక్కడ ఉన్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీయడంతో నిందితులను పట్టుకోవడంలో సహకరించారు. ప్రస్తుతం ఆ మహిళ బాగానే ఉన్నా. అదే సమయంలో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 సీతాలక్ష్మి ఫిర్యాదు మేరకు తమిళనాడు పజమనారికి చెందిన సెంథిల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు సెంథిల్ కుమార్‌ నివాసాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు వెళ్లగా.. ద్విచక్ర వాహనంపై పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సెంథిల్ కాలికి గాయమైంది. ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది.  కాలు విరిగినందుకు సెంథిల్ చికిత్స పొందుతున్నారు. కోలుకున్న వెంటనే అరెస్టు చేస్తామన్నారు పోలీసులు. అపస్మారక స్థితిలో ఉన్న సీతాలక్ష్మిని ఈడ్చుకెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది, శాంతిభద్రతలు మరియు ప్రజల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

click me!