పంజాబ్ సీఎం కొడుకు పెళ్లిలో.. తాగి వచ్చిన పోలీసులు.. చర్చగా మారిన లేఖ..

By AN TeluguFirst Published Oct 14, 2021, 9:37 AM IST
Highlights

ముఖ్యమంత్రి Charanjit Singh Channi కుమారుడు నవజిత్ సింగ్ వివాహం.. ఆదివారం మొహాలీలోని గురుద్వారాలో జరిగింది. Navjit Singh ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సిమరంధీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.

చండీగఢ్ :  Punjab ముఖ్యమంత్రి కుమారుడి వివాహ వేడుకలో యూనిఫామ్ లో ఉన్న పలువురు పోలీసు సిబ్బంది మద్యం తాగి ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు రాష్ట్రంలోని అత్యున్నత పోలీసు అధికారికి రాసిన లేఖలో వెల్లడించారు. అనేక ఇతర భద్రతా లొసుగులను కూడా ఈ లేఖలో ఎత్తి చూపారు. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారిని కూడా సస్పెండ్ చేశారు.

ముఖ్యమంత్రి Charanjit Singh Channi కుమారుడు నవజిత్ సింగ్ వివాహం.. ఆదివారం మొహాలీలోని గురుద్వారాలో జరిగింది. Navjit Singh ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ సిమరంధీర్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు.

అక్టోబర్ 8 న మొహాలీలోని అరిస్టా రిసార్ట్‌లో నిర్వహించిన "లేడీస్ సంగీత్ ఫంక్షన్" లో కూడా భద్రతా లొసుగులు కనిపెట్టారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు రాసిన ఒక వివరణాత్మక లేఖలో, సీనియర్ పోలీసు అధికారి ఒకరు భద్రతా ఏర్పాట్లలో  లోపాలున్నాయని పేర్కొన్నారు. ప్రధాన ద్వారం వద్ద చెకింగ్ సరిగా లేకపోవడం కారణంగా చాలా మంది ఆయుధాలు కలిగిన ఉద్యోగులు తనిఖీ చేయకుండానే వేదిక దగ్గరికి ప్రవేశించారని తెలిపారు.

మహిళా పోలీసులు సాధారణ దుస్తులతో వేదిక వద్ద మోహరించారని, అంతేకాదు లేడీ పోలీసు సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారని, అక్కడ సర్వ్ చేయబడుతున్న ఆహారం, పానీయాలను వినియోగిస్తున్నారు. గెజిటెడ్ ర్యాంక్ పోలీసు అధికారి మంత్రి పాదాలను తాకుతూ కనిపించారని Security loopholes లేఖలో వివరించారు. దీంతో ఈ  లేఖ  చాలా చర్చనీయాంశంగా మారింది.

అంతేకాదు వివాహారిని హాజరైన VIP లు, స్పెషల్ పర్సన్స్  వారి వాహనాల నుండి దిగేప్పుడు, బయటకు వెళ్లేప్పుడు పర్యవేక్షించడానికి CCTV కెమెరాలు ఏర్పాటు చేయలేదని.. ఈ లొసుగు తెలిసిన ఎవరైనా సరే ఈ విధంగా వీఐపీ వేషంలో వేదికలోకి ప్రవేశించవచ్చు.. అని లేఖలో చేర్చబడింది.

ముఖ్యమంత్రి చన్నీ భద్రత కోసం నియమించబడిన కమాండోలు "ఎక్కువగా వారి ఫోన్లలో వీడియోలను చూడటంలో బిజీగా ఉన్నారు",  ముఖ్యమంత్రి భద్రతకు నియమించబడిన కొందరు భద్రతా సిబ్బంది మద్యం సేవించినట్లు గుర్తించబడింది. ప్రవేశ ద్వారాల వద్ద మోహరించిన సిబ్బంది కూడా ఫంక్షన్ ముగిసేలోపు తమ డ్యూటీ పాయింట్లను వదిలివెళ్లారని, కొందరు అనధికార సిబ్బంది కూడా ముఖ్యమంత్రి భద్రతా వలయాన్ని దాటారని ఈ సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు.

తొమ్మిదేళ్ల చిన్నారి కిడ్నాప్.. పక్కింట్లో ప్లాస్టిక్ కవర్ లో చుట్టి...దారుణం..

ఇదిలా ఉండగా, పంజాబ్ కాంగ్రెస్‌లో అసంతృప్తి.. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, సిద్దూ కూడా రాజీనామా చేయడం వంటి షాకింగ్ ఎపిసోడ్‌లు congressను కుదిపేశాయి. ఈ నేపథ్యంలోనే కెప్టెన్‌ను, సిద్దూను సమాన దూరంలో పెట్టి చరణ్‌జిత్ సింగ్ channiని సీఎం చేసింది. కెప్టెన్ పార్టీని వీడారు. క్యాబినెట్ సర్దుబాటులపై అసంతృప్తితో సిద్దూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ కావడం, తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు సిద్దూ సంకేతాలనిచ్చారు. అయినప్పటికీ పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలు ఇంకా ముదిరిపోతున్నాయని, కాంగ్రెస్ ఫార్ములా బెడిసికొట్టేలా ఉన్నదని ఓ వీడియో వెల్లడిస్తున్నది.

లఖింపూర్ ఖేరి ఘటనకు నిరసనగా punjab కాంగ్రెస్ మొహలీలో నిరసన చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమానికి సిద్దూ సహా ఇతర పార్టీ నేతలు, మంత్రులు హాజరయ్యారు. కానీ, సీఎం చన్నీ ఆలస్యంగా వచ్చారు. ఈ సమయంలోనే navjot singh sidhuపైనే ఫోకస్ పెట్టిన ఓ వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వీడియోలో సీఎం చన్నీపై సిద్దూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

click me!