Aryan Khan : టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుందని.. తినకుండా, నీళ్లు తాగకుండా హఠం..

By AN TeluguFirst Published Oct 14, 2021, 8:06 AM IST
Highlights

food, water తీసుకుంటే జైలు టాయిలెట్ వాడాల్సి వస్తుందని ఆర్యన్ ఖాన్ భయపడుతున్నాడట. భోజనం, నీరు తీసుకోవాలని, toilet వాడుకోవాలని జైలు అధికారులు సూచిస్తున్నప్పటికీ వారి మాటలను ఆర్యన్ ఖాన్ వినడం లేదు. తనకు ఆకలి వేయడం లేదని చెబుతున్నాడు. అలాగే, జైలులో ఆర్యన్ ఖాన్ నాలుగు రోజులుగా స్నానం చేయలేదు.

ముంబయి : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు aryan khan జైలులో ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఇన్నాల్లు luxury life‌ అనుభవించిన ఆర్యన్ ఖాన్ జైలు జీవితాన్ని భరించలేకపోతున్నాడు. అతడు సరిగ్గా భోజనం చేయట్లేదని, నీళ్లు కూడా కావాల్సినంతగా తాగట్లేదని జైలు అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 

food, water తీసుకుంటే జైలు టాయిలెట్ వాడాల్సి వస్తుందని ఆర్యన్ ఖాన్ భయపడుతున్నాడట. భోజనం, నీరు తీసుకోవాలని, toilet వాడుకోవాలని జైలు అధికారులు సూచిస్తున్నప్పటికీ వారి మాటలను ఆర్యన్ ఖాన్ వినడం లేదు. తనకు ఆకలి వేయడం లేదని చెబుతున్నాడు. అలాగే, జైలులో ఆర్యన్ ఖాన్ నాలుగు రోజులుగా స్నానం చేయలేదు.

ఆర్యన్ ఖాన్ గురించి shahrukh khan జైలు అధికారుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు. ఆర్యన్ ఆరోగ్యం గురించి షారుఖ్ ఆందోళన చెందుతున్నారు. ముంబై తీరంలో ఇటీవల షిప్ లో నిర్వహించిన రేవ్ పార్టీలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ విక్రయాలు, వినియోగం వ్యవహారంలో విచారణ జరుపుతున్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్సీబీ) ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ముంబై కేంద్ర కారాగారంలో ఉంటోన్న ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ మీద బుధవారం ముంబైలోని ఓ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే, బెయిల్ పిటిషన్ పై వాదనలను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. అంతకుముందు, డ్రగ్స్ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ పాత్ర ఉందని విచారణలో తేలిందని కోర్టుకు ఎన్సీబీ తెలిపింది. 

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఆర్యన్‌ఖాన్‌కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌‌పై విచారణ రేపటికి వాయిదా

అర్బాజ్ ఖాన్ తో పాటు అతడికి తెలిసిన పలువురి నుంచి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కొనేవాడని పేర్కొంది. ఎన్సీబీ దాడులు జరిపిన సమయంలో అర్బాజ్ ఖాన్ బూట్ల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అయితే, ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ కొనడానికి డబ్బు లేదని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఆర్యన్ ఖాన్ drugs  తీసుకోలేదని, అతడి వద్ద డ్రగ్స్ లేవని, అతడు డ్రగ్స్ విక్రయించలేదని అన్నారు. అతడికి బెయిల్ ఇవ్వాలని కోరారు. 

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖానే కీలకం : 

బెయిల్ ఇవ్వొద్దు : ఎన్ సీబీ కౌంటర్ 
మాదక ద్రవ్యాల అక్రమ సేకరణ, వినియోగానికి సంబంధించిన కుట్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో బయటపడిందని Narcotics Control Bureau వెల్లడించింది. ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించాల్సిందిగా ముంబైలోని నార్కోటిక్స్ వ్యవహారాల ప్రత్యేక కోర్టుని కోరింది. 

తొలిసారి వేసిన ఆర్యన్ bail‌ petition‌ను ముంబై కోర్టు గతవారం కొట్టివేయగా, ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. ముంబైనుంచి గోవాకు వెడుతున్న ప్రత్యేక నౌకలో rave party చేసుకున్న కేసులో ఈ నెల మూడో తేదీన ఆర్యన్ ఖాన్ సా 20 మందిని డ్రగ్స్ తో సహా ncb అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరంతా ప్రముఖ సినీ, వ్యాపార కుటుంబాలకు చెందిన పిల్లలు కావడంతో ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇందులో ఆర్యన్ ఖాన్ ని ప్రధాన నిందితునిగా (ఏ-1)గా చూపించారు. 
 

click me!