దోచుకెళ్లిన ఆయుధాలు ఈ బాక్సులో వేయండి.. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఏర్పాటు

Published : Jun 10, 2023, 07:01 PM IST
దోచుకెళ్లిన ఆయుధాలు ఈ బాక్సులో వేయండి.. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఏర్పాటు

సారాంశం

మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంఫాల్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఓ బాక్స్ వెలిసింది. అందులో ఆయుధాలు వేయాలని రాసి ఉన్నది.  

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రం మైతేయి, కుకి తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్నది. ఈ తెగల మధ్య ఘర్షణలే కాకుండా.. రాష్ట్రంలో భద్రతా బలగాలకూ, కొందరు తిరుగుబాటుదారులకు మధ్య కూడా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు పోలీసు స్టేషన్‌ల నుంచి, మణిపూర్ రైఫిల్స్, ఐఆర్‌బీఎన్‌ల ఆయుధ గారాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. వాటిని ఉపయోగించి భద్రతా బలగాలపై, సాధారణ ప్రజలపై కాల్పులకు తెగబడిన ఘటనలు ఉన్నాయి.

ఈ ఘర్షణలు ఇంకా ఆ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. సీఎం ఎన్ బీరెన్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఘర్షణలు ఆపాలని, సుస్థిర శాంతి నెలకొల్పడానికి సహకరించాలని పిలుపు ఇచ్చారు. అయినా.. ఇక్కడ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంఫాల్ ఈస్ట్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఊహించిన రీతిలో ఓ బాక్సు ఏర్పాటు చేశారు. ఎత్తుకెళ్లిన ఆయుధాలను ఈ బాక్సులో వేయాలని, సందేహాలు వదిలి స్వేచ్ఛగా ఈ పని చేయండి అంటూ దానిపై రాశారు.

ఈ బాక్సులో ఆయుధాలు వేసేవారిని ఎవరూ ప్రశ్నించరని, వారి ఐడెంటిటీ ఏమిటనీ అడగరని ఓ వర్గం తెలిపింది. అయితే, దీనిపై స్పందించడానికి ఆ బీజేపీ ఎమ్మెల్యే అందుబాటులో లేరు. 

Also Read: కాంప్రమైజ్ కావాలని మాపై ఒత్తిడి.. మహిళా రెజ్లర్‌కు పోలీసులు అబద్ధం చెప్పారు: రెజ్లర్లు

రాష్ట్రంలో సుమారు 4000 ఆయుధాలు, పేలుడు పదార్థాలు చోరీకి గురయ్యాయి.  పలుమార్లు, పలుచోట్ల కొన్ని మూకలు ఈ దోపిడీకి పాల్పడ్డాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు మేరకు ఆర్బీ, ఇతర ఫోర్స్‌లు చేసిన కూంబింగ్ ఆపరేషన్‌లో సుమారు 900ల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో ఆయుధాలు, ఆయుధాలతో కొన్ని కుటీరాలు కనిపించాయి. కొందరు ఈ కూంబింగ్‌ను సమర్థిస్తుండగా.. మరి కొందరు వ్యతిరే కిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?
Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?