ప్రాణం కాపాడేందుకు రైలు వెనక్కి వచ్చింది

By narsimha lodeFirst Published Apr 28, 2019, 5:25 PM IST
Highlights

ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు కిలోమీటరు దూరం రైలును వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 
 

జైపూర్: ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు కిలోమీటరు దూరం రైలును వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

రాజస్థాన్ రాష్ట్రంలోని  అట్రూ- సల్పూరా రైల్వే లైన్ మీదుగా ఓ రైలు వెళ్తోంది. మతి స్థిమితం లేని రాజేంద్ర వర్మ అనే ప్రయాణీకుడు రైలులో ఉంచి కిందకు దూకాడు. వర్మను కాపాడే క్రమంలో అతని సోదరుడు వినోద్‌ కూడ రైలులోంచి దూకాడు. ఈ ఘటనలో  వర్మకు తీవ్ర గాయాలైతే, వినోద్ కు చిన్నపాటి గాయాలయ్యాయి.

ఇదే రైలులో వీరి బందువు సరేశ్ వర్మ కూడ  ప్రయాణం చేస్తున్నాడు.  అతను చైన్ లాగాడు. అంబులెన్స్‌కు ప్రయాణీకులు ఫోన్ చేశారు. అయితే ఆ ప్రాంతానికి అంబులెన్స్ వచ్చే దారి లేదు.

దీంతో కిలోమీటరు దూరం రైలును తీసుకెళ్లి అక్కడి నుండి రాజేంద్రను ఆసుపత్రికి వైద్య సిబ్బంది ఫోన్‌లో చెప్పారు. ఈ విషయాన్ని రైలు డ్రైవర్ కు చెప్పారు. దీంతో డ్రైవర్ రైలును కిలోమీటరు దూరం వెనక్కి తీసుకెళ్లాడు. అక్కడి నుండి రాజేంద్రను అంబులెన్స్‌లో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడు.
 

click me!