చుక్కేసిన మహిళలు.. దెబ్బకి దిగివచ్చిన అధికారులు

By Siva KodatiFirst Published Apr 28, 2019, 11:24 AM IST
Highlights

మద్యం కాంట్రాక్టు రద్దును స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు

మద్యం కాంట్రాక్టు రద్దును స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్‌ సెక్టార్-48లో గల మద్యం దుకాణం కాంట్రాక్ట్ గడువు పూర్తయినప్పటికీ .. దుకాణాన్ని నడుపుతున్నారని .. ఈ దుకాణం కారణంగా స్థానికులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ దారిలో వచ్చే మహిళలతో మందుబాబులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానిక మహిళలు వాపోతున్నారు.

దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో వీరంతా నిరసనకు కొత్తదారి ఎంచుకున్నారు. శనివారం ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్న మహిళలు అధికారుల ఎదుట మద్యం తాగి, నిరసన తెలిపారు.

దీంతో దిగివచ్చిన అధికారులు మద్యం దుకాణాన్ని వారం రోజుల్లోగా మూసివేయాలని సంబంధిత యాజమానులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మహిళల నిరసనను కొందరు వీడియో తీసి ఆన్‌లైన్‌‌లో పెట్టడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

click me!