మైనర్‌పై లైంగిక దాడి...షాకిచ్చి చంపాడు: నిందితుడి అరెస్ట్

Published : Apr 28, 2019, 11:16 AM IST
మైనర్‌పై లైంగిక దాడి...షాకిచ్చి చంపాడు: నిందితుడి అరెస్ట్

సారాంశం

: ఏడో తరగతి విద్యార్థిపై  లైంగిక దాడి చేసి విద్యుత్ షాక్‌‌తో హతమార్చిన ఘటన  తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చెన్నై: ఏడో తరగతి విద్యార్థిపై  లైంగిక దాడి చేసి విద్యుత్ షాక్‌‌తో హతమార్చిన ఘటన  తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్లు జిల్లా ఉత్తర మధురై సమీపం జీ కురుంపట్టికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని కొన్ని రోజుల క్రితం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

నోటితో కరెంట్ వైరు పట్టుకొని ఒళ్లంతా గాయాలతో  మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాలిక ఇంటికి సమీపంలోని విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు మృతురాలి బంధువులు అనుమానించారు.

ఇదే ప్రాంతానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థే నిందితుడని పోలీసులు గుర్తించారు. నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. ఈ  నెల 16వ తేదీన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా చొరబడి లైంగిక దాడికి దిగినట్టుగా నిందితుడు ఒప్పుకొన్నాడు. 

బాధితురాలు ప్రతిఘటించి కేకలు వేయడంతో తీవ్రంగా కొట్టి లొంగదీసుకొన్నట్టు చెప్పారు.తన ఆనవాళ్లు బయటకు చెప్పుతోందనే భయంతో ఇంట్లో ఉన్న విద్యుత్ వైరును బాలిక నోటిలో ఉంచి కరెంట్‌ షాక్‌కు గురి చేసి హతమార్చానని ఒప్పుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

మెల్‌బోర్న్‌ లో మోదీ క్రేజ్ చూసి ఆస్ట్రేలియా ప్రధాని షాక్ | PM Modi in Australia: Melbourne
ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi arrives in Melbourne, Australia