పీకలదాకా తాగి.. ట్రిపుల్ రైడింగ్: ప్రశ్నించినందుకు పోలీసుల్ని చితక్కొట్టిన మందుబాబులు

By Siva KodatiFirst Published Jun 27, 2021, 3:59 PM IST
Highlights

మద్యం మత్తులో ఉన్న యువకులు తమనే అడ్డుకుంటారా అంటూ పోలీసులనే చితకబాదారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు తలో దిక్కుకు పరుగులు తీయాల్సి వచ్చింది

మద్యం మత్తులో ఉన్న యువకులు తమనే అడ్డుకుంటారా అంటూ పోలీసులనే చితకబాదారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు తలో దిక్కుకు పరుగులు తీయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం సేలంలో రెండు రోజుల క్రితం ఒక మందుబాబు తమ మీద తిరగ బడడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. దీంతో అతను మరణించాడు. ఈ కేసులో ఎస్‌ఐ అరెస్టయ్యారు. ఈ క్రమంలోనే దిండుగల్‌ జిల్లా వత్తలగుండు చెక్‌పోస్టు వద్దకు శుక్రవారం రాత్రి ఆరుగురు యువకులు వచ్చారు. ఒక బైకులో ముగ్గురు చొప్పు న ఉండడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ ధీరన్, హెడ్‌కానిస్టేబుల్‌ మేఘనాథన్, మరో కానిస్టేబుల్‌ వారిని అడ్డుకుని ప్రశ్నించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు తమనే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులు తొక్కారు. 

Also Read:హెల్మెట్, మాస్క్ లేదు.. పది దాటినా రోడ్ల మీదకి: ప్రశ్నించినందుకు పోలీసులపైనే దాడి

మమ్మల్ని చంపేస్తారా అంటూ కర్రలు, కొబ్బరి మట్టలతో చితక్కొట్టారు. గాయపడిన పోలీసులు పరుగులు తీసి ఎలాగో ఆస్పత్రిలో చేరారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు చెక్‌పోస్టులోని సీసీ పుటేజీ ఆధారంగా మందు బాబుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం వత్తలగుండుకు చెందిన రంజిత్, కాళిదాసు, మూర్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు సేలం చెక్‌ పోస్టులో హిందూ మున్నని నాయకుడు చెల్ల పాండియన్‌ పోలీసుల మీద వీరంగం ప్రదర్శించాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఆయన మీద కేసు నమోదైంది. అతన్ని హిందూ మున్నని నుంచి తొలగిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.  

click me!