Maharashtra Earthquake : మహారాష్ట్రలోని హింగోలిలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. ఈ భూకంపం వల్ల తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు వచ్చాయి.
Maharashtra Earthquake : మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాలోని సోమవారం తెల్లవారుజామున 05.09 గంటలకు ఒక్క సారిగా భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుండి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఒక్క సారిగా వచ్చిన ఈ ప్రకంపన వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హింగోలి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడారు. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భూకంప సంభవించిన విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టింది.
Earthquake of Magnitude:3.5, Occurred on 20-11-2023, 05:09:29 IST, Lat: 19.41 & Long: 77.34, Depth: 5 Km ,Location: Hingoli, Maharashtra, India for more information Download the BhooKamp App https://t.co/ivnpJXcxw9 pic.twitter.com/v1FmWiW93E
— National Center for Seismology (@NCS_Earthquake)కాగా.. మహారాష్ట్రలో సంభవించిన ఈ భూకంప ప్రభావం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కనిపించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం, నేపాల్, జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు.
విషాదం.. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్.. ఏం జరిగిందంటే ?
ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లోని అండమాన్ సముద్రంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. దీని వల్ల కూడా ఎలాంటి నష్టమూ సంభవించినట్టు సమాచారం లేదు.